ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌గా... టైమింగ్స్ మారాయి!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పిలుపు మేరకు ‘జీరో పావర్టీ - పీ4 - మార్గదర్శి - బంగారు కుటుంబం’ పాలసీకి విశేష స్పందన వస్తోంది. పేదలకు చేయూతనిచ్చేందుకు పీ4లో భాగస్వాములయ్యేందుకు సంపన్న వర్గాలు ముందుకు వస్తున్నాయి. ఎంతో మంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి బంగారు కుటుంబాలకు సాయంగా నిలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా.. ఓ నిరుపేద కుటంబానికి హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) అండగా నిలిచారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు హోం మంత్రి. పీ4 విధానంలో నిరుపేద కుటుంబానికి మంత్రి అనిత అన్ని విధాలుగా సాయంగా నిలిచారు. యస్ రాయవరం మండలం దార్లపూడి గ్రామానికి చెందిన బాబ్జి కుటుంబానికి ఉపాధి కొరకు రెండు జర్సీ ఆవులను కొనిచ్చారు మంత్రి.
ఇది కూడా చదవండి: Andhrapradesh census: ఏపీలో జనగణనకు ప్రభుత్వం పచ్చ జెండా! మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా..
అలాగే వారి కుమారుడు రూపస్ చదువు పూర్తయ్యే వరకు అయ్యే పూర్తి ఖర్చును హోంమంత్రి భుజాన వేసుకున్నారు. తక్షణం ఆర్థిక సహాయం అందజేశారు. 2012లో జరిగిన రోడ్డు ప్రమాదం బాబ్జిని వికలాంగుడిగా మార్చింది. దీంతో కుటుంబపోషణ భారంగా మారింది. ఈక్రమంలో వారం రోజులు క్రితం నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి అనితను కలిసి తన కష్టాలు చెప్పుకున్నాడు బాబ్జి. బాబ్జి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ దీనస్థితి విని మంత్రి చలించిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన మహాయజ్ఞం ‘జీరో పావర్టీ - P4 -మార్గదర్శి - బంగారు కుటుంబం’ ద్వారా బాబ్జి కుటుంబానికి హోంమంత్రి అండగా నిలిచారు. తమకు అండగా నిలబడి, ఆర్థిక సాయం అందించిన హోంమంత్రి అనితకు బాబ్జి - లక్ష్మి దంపతులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Airport: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ఏపీలో రెండు కొత్త విమానాశ్రయాలు! జిల్లాల దశ తిరిగినట్లే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం...! రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి సిట్ నోటీసులు!
Green Tax Reduction: వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.!
AP Farmers: ఏపీలోని మామిడి రైతులకు తీపికబురు..! రూ.260 కోట్లు విడుదల!
UAE Golden Visa: ఆశలతో ఆడుకుంటున్న ఏజెంట్లు..! యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన!
US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి! గాయపడిన వారిలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: