గూగుల్ వల్ల పొల్యూషన్ పెరుగుతుందని భావిస్తే, మీరు గూగుల్ సేవలను ఉపయోగించవద్దు..
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్..
మీడియా వేదికగా మరోసారి రాజకీయ దుమారం చెలరేగింది. మహా టీవీలో జరిగిన డిబేట్‌లో అడ్వకేట్ రజిని మరియు తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ మధ్య మాటల యుద్ధం సాగింది.
డిబేట్ సందర్భంగా విశాఖపట్నంకు గూగుల్ రావడంతో నగరంలో కాలుష్యం పెరుగుతుందని అడ్వకేట్ రజిని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బండారు వంశీకృష్ణ కౌంటర్ ఇస్తూ వ్యంగ్యంగా స్పందించారు. “గూగుల్ వల్ల పొల్యూషన్ పెరుగుతుందని భావిస్తే, మీరు గూగుల్ సేవలను ఉపయోగించకుండా స్టూడియోకే వచ్చి డిబేట్ చేయాలి” అని అన్నారు.
అదే విధంగా, గూగుల్ ఆధారిత ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా జూమ్ డిబేట్లలో పాల్గొనడం కూడా పొల్యూషన్‌కు కారణమని, నేరుగా స్టూడియోకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని సూచించారు. అంతేకాకుండా, వాట్సాప్ కూడా గూగుల్‌తో అనుసంధానమై ఉందని పేర్కొంటూ, దానిని కూడా డిలీట్ చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఈ డిబేట్‌పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీనిని హాస్యంగా తీసుకుంటే, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ టీవీ డిబేట్ మరోసారి రాజకీయ వాదోపవాదాలకు వేదికగా మారి, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా నిలిచింది. వైరల్ వీడియొ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి