Farmers: రైతులకు శుభవార్త... భారీ సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల పంపిణీ! పూర్తి వివరాలు... PM Modi: ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ! Pawan Kalyan: సింధు ప్రశంసలు.. పవన్ రిప్లై: ‘మ్యాజిక్’ డ్రెయిన్స్‌పై ఆసక్తికర చర్చ! Chandrababu: నేడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్! Mahanadu 2026: నెల్లూరు మహానాడుకు భారీ ఏర్పాట్లు- మంత్రి నారాయణ! Elections 2026: మరికాసేపట్లో కౌంటింగ్.. నాలుగు రాష్ట్రాల సమరం! నేడే తుది ఫలితాలు - ఎవరికి పట్టం? Praja Vedika: నేడు (04/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Investments: ఏపీకి లక్ష కోట్ల భారీ ప్రాజెక్టు... దేశంలోనే అతిపెద్ద డిఫెన్స్ హబ్... అక్కడే ఫిక్స్! Chandrababu: ఆసక్తికర సన్నివేశం... ఎర్రబెల్లి దయాకర్ రావు భుజం తట్టిన చంద్రబాబు! రాజకీయాలు వేరు.. అనుబంధాలు వేరు! Rama Temple: భారీ పోలీసు బందోబస్తు.. కట్టుదిట్టమైన నిఘా.. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై సర్వత్రా ఉత్కంఠ.! Farmers: రైతులకు శుభవార్త... భారీ సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల పంపిణీ! పూర్తి వివరాలు... PM Modi: ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ! Pawan Kalyan: సింధు ప్రశంసలు.. పవన్ రిప్లై: ‘మ్యాజిక్’ డ్రెయిన్స్‌పై ఆసక్తికర చర్చ! Chandrababu: నేడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్! Mahanadu 2026: నెల్లూరు మహానాడుకు భారీ ఏర్పాట్లు- మంత్రి నారాయణ! Elections 2026: మరికాసేపట్లో కౌంటింగ్.. నాలుగు రాష్ట్రాల సమరం! నేడే తుది ఫలితాలు - ఎవరికి పట్టం? Praja Vedika: నేడు (04/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Investments: ఏపీకి లక్ష కోట్ల భారీ ప్రాజెక్టు... దేశంలోనే అతిపెద్ద డిఫెన్స్ హబ్... అక్కడే ఫిక్స్! Chandrababu: ఆసక్తికర సన్నివేశం... ఎర్రబెల్లి దయాకర్ రావు భుజం తట్టిన చంద్రబాబు! రాజకీయాలు వేరు.. అనుబంధాలు వేరు! Rama Temple: భారీ పోలీసు బందోబస్తు.. కట్టుదిట్టమైన నిఘా.. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై సర్వత్రా ఉత్కంఠ.!

Elections: ఐదు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. పలుచోట్ల హోరాహోరీ పోరు!

Elections: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఐదు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కౌంటింగ్ కొనసాగుతోంది.

Published : 2026-05-04 09:52:00

ఆధిక్యంలో కొనసాగుతున్న కీలక నేతలు..

ఐదు అసెంబ్లీల మ్యాజిర్​ ఫిగర్ స్థానాలు..

దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఐదు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కౌంటింగ్ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి, అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపును చేపట్టారు. ప్రశాంతంగా కౌంటింగ్ సాగేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

తమిళనాడులోని కొళత్తూర్‌ తో పాటు 59 స్థానాల్లో ఎం.కె. స్టాలిన్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, పెరంబూరుతో పాటు 80 స్థానాల్లో  విజయ్ ఆధిక్యంలో ఉన్నారు. ఎడప్పాడిలో ఎడప్పాడి కె. పళనిస్వామి ముందంజలో ఉన్నారు. అలాగే చేపాక్కం-తిరువల్లికేణి నియోజకవర్గంలో ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందంజలో ఉన్నారు.

మొదటి పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ ప్రకారం ఎన్‌డీఏ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 7 స్థానాల్లో ముందంజలో ఉంది. తమిళనాడులో డీఎంకే ఆరంభం నుంచే ఆధిక్యాన్ని సాధించింది. ఇక బంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఫలితాలు మారుతూ ఉండటంతో ఉత్కంఠ నెలకొంది.

కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇరు కూటములు చెరో 50 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ గెలుపు కోసం పోటీపడుతున్నాయి.

ఒకవైపు కౌంటింగ్ ఉత్కంఠ కొనసాగుతుండగా, మరోవైపు దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాల కోసం జిలేబీలు తయారు చేస్తున్నారు. ఫలితాలు అనుకూలంగా వస్తాయని భావిస్తూ పార్టీ నేతలు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఐదు అసెంబ్లీల్లో గెలుపు సాధించడానికి కావాల్సిన స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి:
తమిళనాడు (234 స్థానాలు) – మ్యాజిక్ ఫిగర్ 118
పుదుచ్చేరి (30 స్థానాలు) – మ్యాజిక్ ఫిగర్ 16
అస్సాం (126 స్థానాలు) – మ్యాజిక్ ఫిగర్ 64
పశ్చిమ బెంగాల్ (294 స్థానాలు) – మ్యాజిక్ ఫిగర్ 148
కేరళ (140 స్థానాలు) – మ్యాజిక్ ఫిగర్ 71

మొత్తంగా చూస్తే ఐదు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. కీలక నేతల ఆధిక్యం, కూటముల మధ్య గట్టి పోటీతో దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి మరింత పెరిగింది.

Spotlight

Read More →