భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) బడ్జెట్ ఫ్రెండ్లీ యూజర్ల కోసం ఎన్నో ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా రూ.347 అపరిమిత వాయిస్ కాలింగ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇందులో మీరు ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతారు.
ఇది యూజర్లకు బడ్జెట్‌లో ఉంటుంది. ఈ ప్లాన్‌తో మీరు రీఛార్జీ చేసుకుంటే హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా ప్రతిరోజు 2జీబీ పొందుతారు. అంటే ఈ ప్లాన్ మొత్తంగా 100 జీబీ నెట్ లభిస్తుంది. ఇందులో ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితం.
ప్రైవేట్ దిగ్గజ కంపెనీలతో పోలిస్తే 56 రోజుల వ్యాలిడిటీ రూ.500 ధరలో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ రూ.150 ప్రైవేట్ దిగ్గజ కంపెనీల కంటే తక్కువ. వ్యాలిడిటీ ఈక్వల్ గా ఉంది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 4జీ మైల్ స్టోన్ ను అధిగమిస్తుంది.
ఇప్పటికే లక్ష మొబైల్ టవర్స్ 4జీ ఏర్పాటు చేసే దిశగా వెళ్తూ ఉంది. తాజాగా 5జీ సేవలను అందించనుంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో వచ్చే ఏడాది ఈ 5జి సేవలను ప్రారంభించనుంది. బీఎస్ఎన్ఎల్ క్రిస్మస్ సందర్భంగా కూడా ప్రత్యేక రీచార్జి ప్లాన్లను పరిచయం చేస్తూనే ఉంది.
ఎక్స్ వేదికగా వీటిని ప్రకటిస్తోంది. ప్రభుత్వ దిగ్గజ కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్ టెలికామ్ ధరలు పెరిగిన తర్వాత ధరలు మాత్రం పెంపుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ దిగ్గజ కంపెనీకి చెందిన చాలామంది యూజర్లు దీనికి పోర్ట్ అయ్యారు.
అంతేకాదు సెకండ్ సిమ్‌గా బీఎస్ఎన్ఎల్ ఎంచుకుంటున్నారు. దీంతో పాటు వచ్చే ఏడాది నుంచి కూడా ఇక టెలికాం ధరలు పెరుగనున్న నేపథ్యంలో యూజర్స్‌పై ఎలా ప్రభావం పడుతుందో చూడాలి.