LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు!

Ashok Babu: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిచినందుకు వెంకట్రామిరెడ్డి జగన్ ప్రభుత్వంలోనే సస్పెండ్ అయ్యారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్…

AndhraPravasi News Desk 2 min read
Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు!
  • వాటిలో తాము రూ.22 వేల కోట్లు మేం చెల్లించామన్న అశోక్ బాబు…
     
  • Politics: వెంకట్రామిరెడ్డి జగన్ హయాంలోనే సస్పెండ్ అయ్యారని వెల్లడి..

Ashok Babu: ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు సచివాలయ ఉద్యోగ సంఘం మాజీ నేత కాకర్ల వెంకట్రామిరెడ్డిపై జరిగిన వేటుపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు స్పష్టతనిచ్చారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వెంకట్రామిరెడ్డిని తాము కావాలని ఇబ్బంది పెట్టలేదని, అసలు ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే అన్న విషయాన్ని గుర్తు చేశారు. 2024 ఏప్రిల్ 2వ తేదీన ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో, నిబంధనలకు విరుద్ధంగా వైకాపా జెండాలు పట్టుకుని కడప జిల్లాలోని నాలుగు ఆర్టీసీ డిపోల్లో ప్రచారం నిర్వహించినందుకు అప్పటి రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆయనపై కేసులు నమోదయ్యాయని వివరించారు. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఏప్రిల్ 18న పంచాయతీరాజ్ సెక్రటరీ వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేశారని, ఇప్పుడు ఆ విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ పార్టీలకు కొమ్ముకాయడం కాండక్ట్ రూల్స్ ప్రకారం నేరమని, అందుకే ఆనాడు నివేదికలు వచ్చాయని అశోక్ బాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో జరిగిన విచారణను లోతుగా పరిశీలించి, తప్పు నిరూపితం కావడంతోనే ఆయనను సర్వీసు నుంచి డిస్మిస్ చేశామని స్పష్టం చేశారు. కేవలం ఒక సెక్షన్ అధికారిని తొలగిస్తే రాష్ట్రంలో ఏదో జరిగిపోయినట్లు జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని, గతంలో ఏబీ వెంకటేశ్వరరావు వంటి ఉన్నతాధికారులను, మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్‌ను వేధించిన చరిత్ర జగన్ ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు రావాల్సిన రూ. 30 వేల కోట్ల బాకీలను పెట్టిన వ్యక్తి జగన్ అని, తాము అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రూ. 22 వేల కోట్లు చెల్లించి ఉద్యోగుల పక్షపాతిగా నిలిచామని గుర్తు చేశారు.

వెంకట్రామిరెడ్డిపై కేవలం ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలే కాకుండా, హౌసింగ్ సొసైటీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయని అశోక్ బాబు తెలిపారు. గచ్చిబౌలిలోని సెక్రటేరియట్ హౌసింగ్ కాలనీలో ఖాళీ స్థలాలను అక్రమంగా ప్లాట్లుగా మార్చి విక్రయించారని, ఆ వ్యవహారం వల్ల మొత్తం సొసైటీయే రద్దయ్యే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. జగన్ రెడ్డికి దగ్గరి బంధువు కావడం వల్లే ఆయన సచివాలయంలో ఇష్టానుసారంగా వ్యవహరించారని, కరోనా సమయంలో వేల మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినా ఒక్కరికైనా సాయం చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. కాండక్ట్ రూల్స్ అనేవి అందరికీ సమానమేనని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదని ఈ సందర్భంగా అశోక్ బాబు హెచ్చరించారు.
 

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…