అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు! లోకల్ వార్‌కు రంగం సిద్ధం!
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు కూటమి శ్రేణులు సిద్ధంగా ఉండాలని, అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులకు సూచించారు. అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ.. ఎన్నికలు జరగవనే అపోహలకు తావివ్వొద్దని స్పష్టం చేశారు.
- అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని నారా లోకేశ్ తెలిపారు.
- స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచించారు.
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు కూటమి శ్రేణులు సిద్ధంగా ఉండాలని, అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులకు సూచించారు. అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ.. ఎన్నికలు జరగవనే అపోహలకు తావివ్వొద్దని స్పష్టం చేశారు.
బుధవారం అమరావతిలో మంత్రులతో నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో లోకేశ్ పలు అంశాలపై చర్చించారు. స్థానిక ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసుకోవాలని మంత్రులకు సూచించారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా త్వరితగతిన పరిష్కరించుకుని అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ఎన్నికలను వాయిదా వేయించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని లోకేశ్ వ్యాఖ్యానించారు. పొత్తుల అంశంపై సమన్వయ కమిటీ, పార్టీ అధిష్ఠానం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు.
డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేయొద్దు
విద్యాశాఖను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాలు, రాజకీయ విమర్శల విషయంలో అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ సంబంధిత మంత్రులకు సూచించారు. ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడే చర్యలను తీవ్రంగా ఖండించారు.
శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ.. దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు చట్టప్రకారం కేసులు నమోదు చేయగానే వారు పరారయ్యారని అన్నారు. ఉపాధ్యాయులను కించపరిచేలా వ్యవహరించడం, వారిపై దాడులకు పాల్పడటం వంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన అంశాలు ఆధారాలతో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. నిరుద్యోగులకు ప్రయోజనం కలిగించే డీఎస్సీ విషయంలో అనవసర అపోహలు సృష్టించవద్దని సూచించారు.
వర్షాలపై మంత్రులకు కీలక సూచనలు
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటాన్ని లోకేశ్ సానుకూల పరిణామంగా పేర్కొన్నారు. అయితే భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రులను ఆదేశించారు.
వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు జలాశయాలను నింపుకునేందుకు ప్రస్తుత పరిస్థితిని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని మంత్రులకు స్పష్టం చేశారు.
Tags
Be the first to react