Highway: 110 కి.మీ దూరం తగ్గనున్న బెంగళూరు–విజయవాడ మార్గం! AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన! Highway: 110 కి.మీ దూరం తగ్గనున్న బెంగళూరు–విజయవాడ మార్గం! AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన!

మరి ఇంతలా దిగజారిపోయిందా ప్రభుత్వం! సొంతవారినే హత్య చేసిన వారికి తామో లెక్కకాదన్న దస్తగిరి భార్య..

రూ. 5 కోట్లు ఇస్తామని ఆశ చూపించి తన భర్తను బలిపశువును చేశారంటూ ఏపీ సీఎం జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డిపై వివేకా హత్యకేసు అప్రూవర్ దస్తగిరి భార్య షబానా సంచలన వ్య

Published : 2024-01-26 12:45:00

రూ. 5 కోట్లు ఇస్తామని ఆశ చూపించి తన భర్తను బలిపశువును చేశారంటూ ఏపీ సీఎం జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డిపై వివేకా హత్యకేసు అప్రూవర్ దస్తగిరి భార్య షబానా సంచలన వ్యాఖ్యలు చేశారు.

పులివెందులలోని తన నివాసంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆమె చేసిన ఈ ఆరోపణలు సంచలనమయ్యాయి.

అప్పుడు కోట్ల రూపాయల ఆశలు చూపించి చేయని తప్పుకు జైలుకు పంపారని, ఇప్పుడేమో బయటకు రాకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సొంత వారినే హత్య చేసిన వారు తమను వదిలిపెడతారని అనుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉండడంతో రక్షణ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్టు గుర్తు చేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తన భర్తకు పోలీసులు, వైసీపీ కార్యకర్తలే శత్రువులుగా మారారన్న షబానా... తన భర్తకు బెయిలు తెచ్చుకున్నా బయటకు రానివ్వడం లేదన్నారు. 

వారు ఎలాంటి తప్పు చేయకుంటే తన భర్తను జైలు నుంచి బయటకు రానివ్వాలని, అడ్డుకుంటే కనుక వారు తప్పు చేసినట్టు అంగీకరించినట్టేనని తెలిపారు.

వివేకా హత్య కేసులో జైలులో ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారులు ఇటీవల తన భర్తను కలిసి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వివేకా కుమార్తె సునీత తమకు డబ్బులు ఇవ్వలేదని షబానా స్పష్టం చేశారు. 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →