Highway: 110 కి.మీ దూరం తగ్గనున్న బెంగళూరు–విజయవాడ మార్గం! AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన! Highway: 110 కి.మీ దూరం తగ్గనున్న బెంగళూరు–విజయవాడ మార్గం! AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన!

షర్మిల వ్యాఖ్యలపై స్పందించిన సజ్జల... కాంగ్రెస్ లో చేరగానే యాస మారింది అంటూ పలు కీలక వ్యాఖ్యలు!!

అమరావతి: కాంగ్రెస్ పార్టీలో చేరగానే షర్మిల యాస, భాష మారాయని.. ఆమెను చూస్తే జాలేస్తుందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ పీస

Published : 2024-01-22 09:40:00

అమరావతి: కాంగ్రెస్ పార్టీలో చేరగానే షర్మిల యాస, భాష మారాయని.. ఆమెను చూస్తే జాలేస్తుందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు. వైఎస్సార్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంత వేధించిందో అందరికీ తెలుసునని, కానీ ఆ పార్టీలో చేరగానే షర్మిల మారిపోయారని విమర్శించారు.

తెలంగాణలో ఆమె ఏం చేశారని ఏపీకి వస్తున్నారని వైసీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. వైయస్సార్ ఆశయాలకు కట్టుబడి పనిచేస్తున్న జగన్ ను ప్రజలు అక్కున చేర్చుకున్నారని సజ్జల పేర్కొన్నారు.కేవీపీ, రఘువీరారెడ్డి తప్ప ఆమెకు కాంగ్రెస్ లో తెలిసిన వారు కూడా ఎవరూ లేరు.

ఆమెకు తెలిసుంటే కాంగ్రెస్‌ పార్టీ ఆమె కుటుంబానికి ఎలా ద్రోహం చేసిందో తెలిసేది అన్నారు. వైఎస్సార్ మరణానంతరం అక్రమ కేసులు బనాయించి నేరుగా వైఎస్సార్‌ పేరు చార్జ్‌షీట్‌లో పెట్టిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. జగన్‌ ని 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేసారు

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తెలంగాణలో పోటీ ఎందుకు చేయలేదు. అక్కడి ప్రజలకు ఏం సమాధానం చెప్పకుండానే పక్కకు ఎందుకు జరుగుతున్నారు? రేవంత్‌రెడ్డి...ఇక్కడ ఆమెకు అవకాశం లేదు పొమ్మంటే.. తనకు హెల్ప్ అవుతారని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది. ప్రధాని ఉన్న విశాఖ సభలో జగన్‌ హోదా అంశాన్ని లేవనెత్తారు. మా ప్రభుత్వం రాగానే ఢిల్లీలో జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కూడా స్పష్టంగా చెప్పారు.

అడ్డగోలుగా కాంగ్రెస్‌ ఈ రాష్ట్రాన్ని విభజించింది.. ఎందుకు ఏపీకి సరైన గ్యారెంటీలు కల్పించకుండా ఏకపక్షంగా విభజించారో షర్మిల, కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలని’ సజ్జల డిమాండ్ చేశారు.

2019లో అసలు పట్టించుకోని కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం ఇప్పుడు హఠాత్తుగా ఈమెను ఎందుకు పంపారు..? ఓ వైపు బీజేపీ పొత్తు కోసం పురందేశ్వరి ప్రయత్నం చేస్తున్నారు... బీజేపీ పొత్తు ఉంది అని చెప్పుకుంటే లాభం అని భావిస్తున్నారని సజ్జల అన్నారు.

ఆనాడు సోనియా గాంధీ వద్దకు వెళ్లిన ముగ్గురిలో ఈమె కూడా ఉన్నారని, ఆమె కఠినంగా బిహేవ్‌ చేశారని షర్మిలమ్మే చెప్పారని గుర్తుచేశారు. ఆమె వెనుక చంద్రబాబు ఉన్నారనేది రానున్న రోజుల్లో కనిపిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రోజూ టీడీపీ, జనసేన మాట్లాడేవే షర్మిల గారు కూడా మాట్లాడారు. అవే మాట్లాడితే లేని పార్టీకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →