Promotions: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... ఎన్నో ఏళ్ల కళ! వారికి ప్రమోషన్లు కూడా....
Promotions: గ్రామాల్లో దోమల నివారణకు మరియు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి శుక్రవారం నిర్వహించే 'ఫ్రైడే - డ్రై డే' కార్యక్రమాన్ని మరింత పక్కాగా అమలు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ రోజున అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక నిఘా పెట్టాలని, వర్షపు నీరు నిలిచిపోయే చోట్ల తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
-
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ.. 42 మంది ఎంపీడీఓల సీనియారిటీ జాబితాకు డీపీసీ ఆమోదం.
-
పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా.. పంచాయతీరాజ్ శాఖలో 10 వేల మందికి ప్రమోషన్లు!
-
సీజనల్ వ్యాధులపై డిప్యూటీ సీఎం అలర్ట్: గ్రామాల్లో పారిశుధ్యంపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు.
Promotions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రత్యేక చొరవతో అధికారులు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశాన్ని నిర్వహించి సీనియారిటీ జాబితాను ఖరారు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 42 మంది మండలాభివృద్ధి అధికారులకు (ఎంపీడీఓ) డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా (డీడీఓ) పదోన్నతి కల్పిస్తూ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు, పదోన్నతలు చేపడుతుండటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గడిచిన పదేళ్ల కాలంలో పంచాయతీరాజ్ శాఖలో ఈ స్థాయిలో ఉద్యోగోన్నతులు కల్పించడం ఇదే తొలిసారి అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం ఈ ఒక్క శాఖలోనే దాదాపు 10 వేల మందికి పైగా సిబ్బందికి రకరకాల విభాగాల్లో పదోన్నతులు లభించడం ఒక రికార్డుగా నిలిచింది. చాలా ఏళ్లుగా ఒకే హోదాలో మగ్గిపోతున్న అధికారులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
పదోన్నతుల వ్యవహారంతో పాటు రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో కలుషిత నీటి వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, కాబట్టి అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ తాగునీటి పైప్లైన్ లీకేజీలను అరికట్టాలని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ టాబ్లెట్లను తగినంత మొత్తంలో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
గ్రామాల్లో దోమల నివారణకు మరియు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి శుక్రవారం నిర్వహించే 'ఫ్రైడే - డ్రై డే' కార్యక్రమాన్ని మరింత పక్కాగా అమలు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ రోజున అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక నిఘా పెట్టాలని, వర్షపు నీరు నిలిచిపోయే చోట్ల తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రమాదకర దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయించాలని డిప్యూటీ సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూనే, ఇటు ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం పట్ల ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.