Highway: 110 కి.మీ దూరం తగ్గనున్న బెంగళూరు–విజయవాడ మార్గం! AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన! Highway: 110 కి.మీ దూరం తగ్గనున్న బెంగళూరు–విజయవాడ మార్గం! AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన!

30 ఏళ్ళు వెనక్కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్... 'రా కదలి రా' అంటూ దద్దరిల్లిన తిరువూరు

సీఎం జగన్ దుర్మార్గపు పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆదివారం నిర్వహించిన 'రా

Published : 2024-01-07 15:10:00

సీఎం జగన్ దుర్మార్గపు పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆదివారం నిర్వహించిన 'రా కదలిరా' బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో నాతో సహా ప్రజలందరూ బాధితులేనని అన్నారు. ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే.. ఇక్కడ అమరావతి వెలవెలబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనికి కారణం జగన్ రివర్స్ పాలనే అని ప్రజలు గుర్తించాలని చెప్పారు. 'ఓ వ్యక్తి వల్ల ఓ రాష్ట్రం.. ఓ తరం ఇంతలా నష్టపోయిన పరిస్థితి ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఓ అసమర్థుడు అధికారంలోకి వస్తే కొంతవరకు, అదే ఓ దుర్మార్గుడికి అధికారం అప్పగిస్తే తిరిగి కోలుకోలేని స్థితిలో నష్టపోతాం. ప్రజాస్వామ్యంలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. ఈ అరాచక పాలనకు చరమ గీతం పాడాలి.' అని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన కృష్ణా జిల్లా వాసులు ఉంటారని, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వాళ్ళు టాప్ అని, కృష్ణాజిల్లా వాసులు ప్రపంచమంతా విస్తరించారని కొనియాడారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్‌గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని, 25 సంవత్సరాల క్రితం తాను పిల్లలకు ఇచ్చిన ఆయుధం ఐటి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో ఉంచినప్పుడు ప్రపంచమంతా సంఘీభావంగా నిలిచిందన్నారు. ఒకపక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే... సీఎం జగన్ చర్యల వల్ల అమరావతి వెలవెలబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రివర్స్ చర్యల వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. ప్రతి ఒక్కరూ ‘రా కదలిరా’ అంటూ నారా చంద్రబాబు తిరువూరు సభ వేదికగా పిలుపునిచ్చారు.

అంతకుముందు తిరువూరు చేరుకున్న చంద్రబాబుకు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ-జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు, తెలంగాణ సరిహద్దు కావటంతో.. ఖమ్మం జిల్లా నుంచి టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలి వచ్చారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల నుంచి భారీగా వాహనాలతో నేతలు ప్రదర్శనగా సభాస్థలికి చేరుకున్నారు. అయితే చంద్రబాబు సభకు వెళ్లే కార్లను లక్ష్మీపురం వద్ద బారికేడ్లను పెట్టి పోలీసులు కార్లను నిలిపివేస్తున్నారు

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →