LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Belgium: బెల్జియంలో వర్క్ పర్మిట్ ప్రక్రియ పూర్తి డిజిటల్.. 2026 మే నుండి..

Belgium: యూరప్ దేశమైన బెల్జియం విదేశీ ఉద్యోగులకు సంబంధించిన అనుమతుల ప్రక్రియలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. 2026 మే 1 నుంచి షార్ట్‌టర్మ్ వర్క్ పర్మిట్, కమ్యూటర్ పర్మిట్ దరఖాస్తులన్నింటినీ పూర్తిగా డిజిటల్ విధానంలోకి మార్చనున్నట్లు అధికారులు ప్రకటించారు.

AndhraPravasi News Desk 2 min read
Belgium: బెల్జియంలో వర్క్ పర్మిట్ ప్రక్రియ పూర్తి డిజిటల్.. 2026 మే నుండి..

విదేశీ ఉద్యోగుల అనుమతుల ప్రక్రియలో భారీ మార్పులు..

ఫెడరల్ ఇమిగ్రేషన్ ఆఫీస్ అధికారిక ప్రకటన..

యూరప్ దేశమైన బెల్జియం విదేశీ ఉద్యోగులకు సంబంధించిన అనుమతుల ప్రక్రియలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. 2026 మే 1 నుంచి షార్ట్‌టర్మ్ వర్క్ పర్మిట్, కమ్యూటర్ పర్మిట్ దరఖాస్తులన్నింటినీ పూర్తిగా డిజిటల్ విధానంలోకి మార్చనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఏప్రిల్ 17, 2026న ఫెడరల్ ఇమిగ్రేషన్ ఆఫీస్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఇప్పటివరకు కొనసాగుతున్న ఈమెయిల్ విధానాన్ని పూర్తిగా నిలిపివేసి, ఇకపై అన్ని దరఖాస్తులు ప్రభుత్వ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. ఎంప్లాయర్ లేదా వారి ప్రతినిధులు తప్పనిసరిగా ఈ కొత్త విధానాన్ని అనుసరించాలి.

ఈ మార్పు ప్రధానంగా యూరప్ యూనియన్‌కు చెందని (నాన్-ఈయూ) నిపుణుల కోసం ఇచ్చే తాత్కాలిక వర్క్ పర్మిట్లపై ప్రభావం చూపనుంది. సాధారణంగా 90 రోజుల వరకు ఉండే ఈ పర్మిట్లు టెక్నికల్ సపోర్ట్, వ్యాపార సమావేశాలు, శిక్షణ, పరికరాల ఇన్‌స్టాలేషన్ వంటి పనుల కోసం జారీ చేస్తారు.

ఈ డిజిటల్ మార్పుతో పనులు వేగంగా పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇంతకుముందు ఈమెయిల్ ద్వారా పంపిన దరఖాస్తుల్లో పూర్తి సమాచారం లేకపోవడం, అన్నీ డాక్యుమెంట్ లు, ఫైళ్లు లేకపోవడం  వల్ల ఆలస్యాలు ఏర్పడేవి. కొత్త ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా దరఖాస్తులను సులభంగా ట్రాక్ చేయడం, డాక్యుమెంట్లను త్వరగా పరిశీలించడం, మొత్తం ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందని తెలిపారు.

అయితే, కొత్త విధానం అమల్లోకి రావడానికి ముందు ఎంప్లాయర్ లు ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసుకుని, డిజిటల్ క్రెడెన్షియల్స్ పొందాలి. ముందుగానే నమోదు చేయకపోతే దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ప్రత్యేకంగా వాలోనియా ప్రాంతం లో తాత్కాలిక సడలింపు కల్పించారు. అక్కడ ఆగస్టు 31, 2026 వరకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. కానీ ఫ్లాండర్స్ మరియు బ్రస్సెల్స్ క్యాపిటల్ రీజన్ ప్రాంతాల్లో మే 1 నుంచే పూర్తిగా ఆన్‌లైన్ విధానం తప్పనిసరి కానుంది.

ఈ సంస్కరణ బెల్జియం ప్రభుత్వం చేపడుతున్న విస్తృత డిజిటల్ మార్పులలో భాగం. యూరప్ దేశాల్లో ప్రజా సేవలను పూర్తిగా డిజిటల్ దిశగా మార్చే ప్రయత్నాలకు ఇది అనుగుణంగా ఉంది. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత, ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు పంపే విధానానికి పూర్తిగా ముగింపు పలుకుతూ, బెల్జియం వర్క్ పర్మిట్ వ్యవస్థలో ఇది ఒక కీలకమైన మార్పుగా నిలవనుంది.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…