LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Iran Peace Proposal: యుద్ధం ఆగాలంటే ఆ 3 షరతులు తీరాల్సిందే.. అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఇరాన్ లాస్ట్ వార్నింగ్!

Iran Peace Proposal: పశ్చిమాసియా యుద్ధంలో 13వ రోజు కీలక మలుపు! ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ విధించిన మూడు కఠిన షరతులు అమెరికా, ఇజ్రాయెల్‌లను ఆలోచనలో పడేశాయి...

AndhraPravasi News Desk 2 min read
Iran Peace Proposal: యుద్ధం ఆగాలంటే ఆ 3 షరతులు తీరాల్సిందే..  అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఇరాన్ లాస్ట్ వార్నింగ్!

పశ్చిమాసియాలో యుద్ధం మొదలై నేటికి పదమూడు రోజులు గడుస్తున్నా, పరిస్థితి ఏమాత్రం కుదుటపడటం లేదు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా దాడులు ప్రారంభించినప్పటి నుండి ఇక్కడ తుపా మోత ఆగడం లేదు. ఇప్పటికే సుమారు 1,200 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, ఆస్తి నష్టం అంచనాలకు అందడం లేదు. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. రష్యా, పాకిస్థాన్ దేశాధినేతలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, యుద్ధానికి ముగింపు పలకాలంటే తాము విధించిన మూడు ప్రధాన డిమాండ్లకు అగ్రరాజ్యం తలొగ్గాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్ పెట్టిన మొదటి షరతు ప్రకారం.. అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ యొక్క సార్వభౌమాధికారాన్ని  ఆ దేశానికి ఉన్న చట్టబద్ధమైన హక్కులను ప్రపంచ దేశాలన్నీ గుర్తించాలి. ఇక రెండో డిమాండ్ ఆర్థికపరమైనది. ఈ 13 రోజుల యుద్ధంలో జరిగిన భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి బాధ్యత వహిస్తూ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భారీగా నష్టపరిహారం చెల్లించాలని మసూద్ డిమాండ్ చేశారు. మూడోది l అత్యంత కీలకమైనది ఏమిటంటే.. భవిష్యత్తులో ఇరాన్‌పై మళ్లీ ఎలాంటి దాడులు జరగవని, దీనికి అంతర్జాతీయ సమాజం నుండి గట్టి హామీ ఉండాలని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ డిమాండ్లు నెరవేరితేనే శాంతి చర్చలకు తాము సిద్ధమని ఇరాన్ తెగేసి చెప్పింది.

ఈ యుద్ధ ప్రభావం కేవలం ఆ దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ప్రపంచానికి అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూతపడటంతో చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ఇంధన సంక్షోభం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రవాణా వ్యవస్థ దెబ్బతినడం, నిత్యావసరాల beధరలు పెరగడం వంటి ముప్పులు పొంచి ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. గూగుల్, ఐబీఎం వంటి టెక్ దిగ్గజాలను కూడా టార్గెట్ చేస్తామని ఇరాన్ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి భిన్నంగా ఉంది. బుధవారం ఆయన మాట్లాడుతూ.. "మేము ఇప్పటికే ఇరాన్ యుద్ధంలో విజయం సాధించాం" అంటూ ప్రకటించారు. యుద్ధం ముగిసిందని ఆయన చెబుతున్నప్పటికీ, అమెరికా సైన్యం మాత్రం ఇంకా అక్కడే మోహరించి ఉండటం గమనార్హం. తమ లక్ష్యం పూర్తిగా నెరవేరే వరకు సైన్యం వెనక్కి వచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఓవైపు ఇరాన్ చర్చల కోసం షరతులు విధిస్తుంటే, మరోవైపు అమెరికా తన మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో శాంతి చర్చలు ఇప్పట్లో ఫలించేలా కనిపించడం లేదు.

ప్రస్తుతం ఇరాన్ అంతర్గతంగా కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆ దేశ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ గతంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారని, ఆయన పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, అమెరికాకు కూడా ఈ యుద్ధం భారంగా మారుతోంది. కేవలం వారం రోజుల్లోనే సుమారు 94,500 కోట్ల రూపాయల ఖజానా ఖాళీ అయినట్లు సమాచారం. అటు ఇరాన్ పట్టుదల, ఇటు అమెరికా దూకుడు మధ్య పశ్చిమాసియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ యుద్ధ జ్వాలలు ఎప్పుడు చల్లారుతాయో, శాంతి ఎప్పుడు వెల్లివిరుస్తుందో వేచి చూడాలి.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…