విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతి చెందిన ముగ్గురు కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం ప్రకటించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి కారణాలు వెలికి తీయాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.