ఇది కూడా చదవండి: Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!
ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ(Vijay Antony) తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తనకు రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదని, ప్రస్తుతానికి ఆ దిశగా ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘మార్గన్’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రవేశం గురించి విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ... "నటీనటులు ఏదో ఒక సమయంలో రాజకీయాల్లోకి రావాలన్న నియమమేమీ లేదు. ఒకవేళ ప్రజాసేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినా, వారికి ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించాలి.
ఇది కూడా చదవండి: highway: ఏపీలో ఆ హైవేను ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, కేంద్రానికి చంద్రబాబు లేఖ..! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!
అప్పుడే వారు అధికారంలోకి రాగలుగుతారు. నిజం చెప్పాలంటే, నాకు రాజకీయాలపై అంతగా అవగాహన లేదు. కేవలం ఫేమ్ ఉంది కదా అని రాజకీయాల్లోకి ప్రవేశించలేం. ముందుగా ప్రజల సమస్యలను క్షుణ్ణంగా అర్థం చేసుకోగలగాలి" అని అన్నారు. ఇదే సమయంలో మాదకద్రవ్యాల కేసులో నటుడు శ్రీకాంత్ అరెస్ట్(Srikanth Arrested) కావడం పట్ల కూడా విజయ్ ఆంటోనీ స్పందించారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం అనేది కొత్త విషయం కాదని, ఈ సమస్య చాలా కాలంగా ఉందని ఆయన ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Palnadu Incident: పల్నాడులో పట్టపగలే దారుణం.. రోడ్డు పక్కన మంటల్లో మృతదేహం!
ఎంతోమంది మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌కు సంబంధించిన కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని, ఇందులో నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఆయన తెలిపారు. విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మార్గన్’. లియో జాన్‌పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో విజయ్ మేనల్లుడు అజయ్ ధీషన్ ప్రతినాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సముద్రఖని, దీప్షిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!
Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..
Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!
Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!
Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: