LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gulf

USA - Iran: ఇరాన్‌కు ఆర్థిక ఊరట? ఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల..

USA - Iran: ఇస్లామాబాద్‌లో జరుగుతున్న కీలక చర్చల మధ్య ఇరాన్–అమెరికా సంబంధాల్లో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. అమెరికా ప్రభుత్వం ఖతార్ సహా ఇతర విదేశీ బ్యాంకుల్లో నిల్వలో ఉన్న ఇరాన్‌కు చెందిన ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

AndhraPravasi News Desk 1 min read
USA - Iran: ఇరాన్‌కు ఆర్థిక ఊరట? ఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల..

ఇరాన్–అమెరికా సంబంధాల్లో ఒక ముఖ్యమైన పరిణామం.. 

ఇరాన్‌కు చెందిన ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల.. 

ఇస్లామాబాద్‌లో జరుగుతున్న కీలక చర్చల మధ్య ఇరాన్–అమెరికా సంబంధాల్లో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఒక సీనియర్ ఇరాన్ వర్గం వెల్లడించిన వివరాల ప్రకారం, అమెరికా ప్రభుత్వం ఖతార్ సహా ఇతర విదేశీ బ్యాంకుల్లో నిల్వలో ఉన్న ఇరాన్‌కు చెందిన ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై ఇరాన్ అధికార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. ఇది వాషింగ్టన్‌తో జరుగుతున్న చర్చల్లో భాగంగా తీసుకున్న నిర్ణయం అని భావిస్తున్నట్లు ఆ వర్గం తెలిపింది. అయితే ఈ అంశంపై అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

సున్నితమైన విషయం కావడంతో తన పేరు వెల్లడించకూడదని కోరిన ఆ ఇరాన్ వర్గం, ఈ ఆస్తుల విడుదల నిర్ణయం ఒక కీలక అంశానికి అనుసంధానమై ఉందని వెల్లడించింది. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హొర్మూజ్ లో నౌకాయానానికి భద్రత కల్పించడం ఈ చర్చల్లో ప్రధాన అజెండాగా ఉన్నట్లు పేర్కొంది.

ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గం భద్రతపై ఎప్పటినుంచో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్తుల విడుదల, హోర్ముజ్ జలసంధిలో సురక్షిత ప్రయాణం మధ్య సంబంధం ఉందని వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇస్లామాబాద్ చర్చలు ఏ దిశగా సాగుతాయో అనే ఆసక్తి అంతర్జాతీయ వర్గాల్లో పెరుగుతోంది. ఈ నిర్ణయం నిజంగా అమల్లోకి వస్తే, ఇరాన్‌కు ఆర్థికంగా కొంత ఊరట లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలను…

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: సౌదీ అరేబియాలోని రియాద్ జైలులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామా…