తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి విరాళాలు భారీగా చేరుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్‌కు ఇప్పటివరకు రూ.2200 కోట్లకు పైగా విరాళాలు అందాయి. 1985లో ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన స్కీమ్‌ను ప్రారంభించగా, 2014లో టీటీడీ దీన్ని శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్‌గా మార్చింది. ప్రారంభంలో కేవలం 2 వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహించగా, ప్రస్తుతం రోజుకు లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించే స్థాయికి అభివృద్ధి చెందింది. టీటీడీకి ఇప్పటివరకు 9.7 లక్షల మంది దాతలు విరాళాలు అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత టీటీడీ అన్నప్రసాదంపై ప్రత్యేక దృష్టి సారించింది. భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో, బోర్డు నిర్ణయం మేరకు భోజన మెనూలో అదనంగా శెనగ వడలను చేర్చారు.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!
ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!
బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!
ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!
వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?
ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!
జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: