అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై ఉక్కపాదం మోపిన ఆయన వారిని బలవంతంగా స్వదేశాలకు పంపించేస్తున్నారు. అలాగే వీసా గడువు ముగిసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో దాదాపుగా లక్ష మందికి పైగా భారతీయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వీరంతా ఒకే రకమైన వీసాపై వెళ్లి అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
హెచ్1బీ వీసా పొందిన వారిపై ఆధారపడిన వారు అంటే వారి పిల్లలు.. డిపెండెంట్ వీసా (హెచ్4) కింద అమెరికాకు వెళ్లొచ్చు. అయితే మైనర్‌గా ఉన్నప్పుడు వెళ్లిన వీరికి 21 ఏళ్ల వచ్చే వరకు ఈ వీసా పని చేస్తుంది. ఆ తర్వాత రెండేళ్లు సమయం ఇస్తారు. ఆలోపు కొత్త వీసాను తీసుకోవాల్సి ఉంటుంది. కానీ డిపెండెంట్ వీసాపై అమెరికాకు వెళ్లిన 1.34 లక్షవ మందికి భారతీయుల వీసా గడువు ముగింపు దశకు వచ్చిందట. అయితే వీరంతా గడువు ముగిసే వరకు ఉన్నత చదువులు కోసం ఎఫ్-1 వీసా (స్టూడెంట్ వీసా)కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!
కానీ ఇది తీసుకోవాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్టూడెంట్ వీసా పొందితే.. అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదు అవుతారు. దీని వల్ల భవిష్యత్తులో స్కాలర్‌షిప్ సహా ఇతర ప్రభుత్వ సాయానికి దూరం అవుతారు. దీంతో వాళ్లు ఈ స్టూడెంట్ వీసాను తీసుకోలేక.. గడువు ముగిశాకా ఏం చేయాలో పాలుపోక నరకం చూస్తున్నారట. గడువు ముగిశాకా వీసా పునరుద్ధరణ కోసం రెండేళ్లు సమయం ఇచ్చినా.. వాటిపై న్యాయస్థానాలు భిన్నాభిప్రాయాలు వెలువరుస్తున్నాయి. దీంతో వీరంతా మరింత భయపడాల్సి వస్తోంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ముఖ్యంగా ఇప్పటి వరకు డిపెండెంట్ వీసాపై వెళ్లిన చిన్నారులు సహా సరైన పత్రాలు లేని వలసదారులకు డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) నిబంధన రక్షణగా ఉండేది. అయితే ఇది చట్టవిరుద్ధం అంటూ దీని కింద విద్యార్థులు వర్క్ పర్మిట్ పొందలేరంటూ ఇటీవలే టెక్సాస్‌లోని న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. ఈ నిబంధన లేకపోతే ఎంతో మంది భారతీయ పిల్లలపై ప్రభావం పడే అవకాశం ఉండండతో.. భయం భయంగానే కాలం గడుపుతున్నారు. ఈ సమస్య నుంచి దూరం అయ్యేందుకు వీరి తల్లిదండ్రులు గ్రీన్ కార్డు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా.. ఏళ్లు గడుస్తున్నా అవి మాత్రం రావడం లేదట. చూడాలి మరి ముందు ముందు ఏం జరగనుంది అనేది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..
వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!
మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!
అమెరికాలో తెలుగు యువకుడి అనుమానాస్పద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..
నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..
వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: