ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, యువ నిర్మాత నాగవంశీ తెలుగుదేశం పార్టీకి రూ. 25 లక్షల భారీ విరాళం అందించారు. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకల్లో ఈ ప్రకటన వెలువడింది. ప్రతి ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ మహానాడును ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కడపలో మహానాడు జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా, పార్టీకి విరాళాలు అందించిన దాతల పేర్లను చంద్రబాబు నాయుడు వేదికపై నుంచి చదివి వినిపించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
ఈ క్రమంలోనే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత నాగవంశీ పాతిక లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నాగవంశీ, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సన్నిహితంగా పనిచేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే అనేక చిత్రాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ భాగస్వామ్యం ప్రముఖంగా కనిపిస్తుంది. కొన్ని సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య పేరును నిర్మాతల్లో ఒకరిగా, ఆయనకు చెందిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ పేరును సహ నిర్మాణ సంస్థగా కూడా పేర్కొనడం గమనించవచ్చు. కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పనిచేస్తున్న నాగవంశీ, తెలుగుదేశం పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!
లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే!
ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: