ఇవాళ సినీ ప్రేమికులందరికీ పండుగే పండుగ! రెండు మోస్ట్ అవైటెడ్ సినిమాల నుంచి అప్డేట్లు రావడం విశేషం. ఒక వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుండగా, మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు కింగ్ నాగార్జున కలిసి నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’ ట్రైలర్ కూడా ఈ సాయంత్రం 7 గంటలకు విడుదల కానుంది.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘OG’ ఫస్ట్ సింగిల్ కోసం సోషల్ మీడియాలో హైప్ ఇప్పటికే తారస్థాయికి చేరింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ పాటకు సంబంధించిన చిన్న చిన్న లీకులు, పోస్టర్లు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. పవన్ లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ అన్నీ కూడా ఫ్యాన్స్ లో భారీ అంచనాలను పెంచేశాయి.
ఇక ‘కూలీ’ సినిమా విషయానికొస్తే, రజినీకాంత్–నాగార్జునల కాంబినేషన్ అంటే ఊహించగలమా ఎంత మాస్ యాక్షన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుందో! ఈ సినిమాలో ఇద్దరూ శక్తివంతమైన పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం. ట్రైలర్‌తో ప్రేక్షకులకు ఆ మాస్ మజా మొదటిసారి చూపించబోతున్నారు మేకర్స్.
ఈ రెండు సినిమాల అప్డేట్లు ఒకే రోజు రావడం సినీ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌గా మారింది. సోషల్ మీడియా మీద ఇప్పటికే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతుండటం విశేషం.