ప్రకృతి మనకు ఇచ్చిన వరాల్లో వెల్లుల్లి, తేనె ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటకాల్లో రుచిని పెంచడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఇవి అద్భుతమైన ఔషధాల్లా పనిచేస్తాయి. పురాతన కాలం నుండి ఆయుర్వేదం, యునాని, హోమియోపతి లాంటి వైద్య విధానాల్లో ఇవి విస్తృతంగా వాడుతున్నారు. నిపుణులు చెబుతున్న మాటేమిటంటే – ఒక నెల పాటు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తేనెలో నానబెట్టిన వెల్లుల్లి తింటే ఫలితాలు చూసి మీరు ఆశ్చర్యపోతారు.
మొదటిగా, తేనె-వెల్లుల్లి మిశ్రమం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం లాంటి సాధారణ సమస్యలు తగ్గిపోతాయి. ప్రేగులలోని చెడు బ్యాక్టీరియా నశించి, మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.
జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లకు ఈ మిశ్రమం మంచి ఔషధం. తరచూ అనారోగ్యం వచ్చే వారికి ఇది సహజమైన ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది.ఈ మిశ్రమం శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దాంతో ముఖం సహజంగా ప్రకాశవంతంగా ఉంటుంది.
ఉదయం ఖాళీ కడుపుతో తేనెలో వెల్లుల్లి తింటే మెటాబాలిజం వేగవంతం అవుతుంది. కొవ్వు కరుగుతుంది. ముఖ్యంగా కడుపు చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్ తగ్గుతుంది. క్రమంగా బరువు నియంత్రణలో ఉంటుంది.అదనంగా, అలసట తగ్గడం, శక్తి పెరగడం, ఒత్తిడి తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్యం నిమిత్తం ప్రకారం మీ డాక్టర్ ని సంప్రదించి
తీసుకోవడం మంచిది.