పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటేనే ఒక క్రేజ్. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులంతా ఎదురుచూస్తారు. బాహుబలి సిరీస్‌తో గ్లోబల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్ ఏ జానర్‌లోనైనా తన ప్రత్యేకమైన స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకుంటారు. ప్రభాస్ కొత్తగా చేస్తున్న చిత్రం ది రాజాసాబ్ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ ప్రభాస్ పోస్టర్ విడుదలవడంతోనే ప్రేక్షకుల్లో పెద్ద క్రేజ్ సృష్టించింది.
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రభాస్ లుక్, స్టైల్, కామెడీ టచ్, థమన్ ఇచ్చిన మ్యూజిక్ అన్ని కలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు అందరి చూపు ట్రైలర్‌పైనే ఉంది.
సినీ చిత్ర పరిశ్రమలో సమాచారం ప్రకారం దసరా కానుకగా అక్టోబర్ 1 ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన రోల్ కూడా సినిమాకి పెద్ద హైలైట్ అవుతుందని చెప్పుకుంటున్నారు. థమన్ అందిస్తున్న సంగీతం, బీజీఎం సినిమాకి మరో లెవెల్ క్రియేట్ చేస్తుందనే అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రోజు ఓజి సినిమా చూస్తేనే తెలిసిపోతుంది
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ భారీ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్, అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ దసరా సీజన్‌లో ప్రేక్షకులకు పండుగ కానుంది. మొత్తానికి, ది రాజాసాబ్’ బాక్సాఫీస్ బద్దలైపోతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.