అమరావతి (Amaravati) వాతావరణ కేంద్రం తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఈ నెల 24వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది.
దీనితో పాటు, 24 నుంచి 26వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ (Rayalaseema) ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం కూడా ఉంది.
తీరప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు, మత్స్యకారులు, ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ (Meteorological Department) సూచించింది.