ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. తాజాగా ఏసీబీ కోర్టులో 200 పేజీల రెండో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఇందులో బాలాజీ గోవిందప్ప, ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి పాత్రలపై కీలక ఆధారాలు సమర్పించారు.
కాల్ డేటా రికార్డులు, గూగుల్ టేకౌట్, ల్యాప్‌టాప్ డేటా ఆధారంగా లిక్కర్ పాలసీ రూపకల్పనలో ధనుంజయ్ రెడ్డి నేరుగా జోక్యం చేసుకున్నట్లు సిట్ తేల్చింది. ఎవరి నుంచి ఎంత ముడుపులు తీసుకున్నారు? ఎవరికి ఎంత చేరింది? అనే వివరాలను కూడా ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు.
విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలతో ఈ ముగ్గురు జరిపిన ఫోన్ సంభాషణలు, లిక్కర్ సిండికేట్ సమావేశాలకు ధనుంజయ్ రెడ్డి పలుమార్లు హాజరైన సాక్ష్యాలు కూడా జత చేశారు. బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టిన ఆధారాలను కూడా సిట్ సమర్పించింది. గత జూలై 19న 305 పేజీల తొలి ఛార్జ్‌షీట్‌ను సిట్ కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే.