"సీఎం చంద్రబాబు తన బ్రాండ్ ఇమేజ్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు. అలాంటి నాయకుడిని ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ జగన్ మాత్రం శాపనార్థాలు పెడుతున్నారు" అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ పర్యటనపై స్పందించారు.
"ఒకప్పుడు హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగితే పోలీసులపై వైఫల్యం మోపారు. ఇప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటే ఆంక్షలు అంటున్నారు. జగన్ పర్యటనలో ఒక హెడ్ కానిస్టేబుల్ చేయి విరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చేశారు. ఇలాంటి ఆంక్షలు ఉల్లంఘించిన వైకాపా కార్యకర్తలు, నేతలపై కేసులు నమోదు చేయాల్సిందే. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిపై జగన్ ఆరోపణలు చేస్తున్నారు. కానీ గతంలో ఆయన మీ పార్టీకి చేసిన సహాయం గుర్తులేదా?" అని ప్రశ్నించారు కోటంరెడ్డి.
"జగన్ ప్రసంగిస్తుంటే పక్కన ఉన్న వారు రప్పా రప్పా అంటూ కేరింతలు కొడుతున్నారు. మీరు రప్పా రప్పా అంటే... మేము శాంతి శాంతి అనాలా? చర్యలకు ప్రతిచర్య తప్పదు. నేను వైకాపా అధికారంలో ఉన్నప్పుడే 16 నెలల ముందే జగన్ని ఎదిరించి బయటకు వచ్చాను. అప్పుడు ఈ రప్పా రప్పా ఎక్కడ?" అని ఎద్దేవా చేశారు.