LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gadgets

Redmi 15A: రూ. 12,999 కే రెడ్‌మీ 15A లాంచ్ 6,300mAh భారీ బ్యాటరీ, 32MP కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు!

Redmi 15A: భారత మార్కెట్లోకి రెడ్‌మీ 15A విడుదలయ్యింది. రూ. 12,999 ప్రారంభ ధరతో లభించే ఈ ఫోన్‌లో 6,300mAh భారీ బ్యాటరీ, 32MP కెమెరా మరియు 6.9 అంగుళాల డిస్‌ప్లే వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి..

AndhraPravasi News Desk 2 min read
Redmi 15A: రూ. 12,999 కే రెడ్‌మీ 15A లాంచ్ 6,300mAh భారీ బ్యాటరీ, 32MP కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు!

Redmi 15A Price: షావోమీకి చెందిన సబ్-బ్రాండ్ రెడ్‌మీ, భారత మార్కెట్లోకి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ 15A' (Redmi 15A)ను ఈరోజే విడుదల చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారి కోసం ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ముఖ్యంగా ఇందులో ఉన్న 6,300mAh భారీ బ్యాటరీ, 32 మెగాపిక్సెల్ కెమెరా వంటి అంశాలు ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చిన ఈ 5G ఫోన్, నేటి యువత అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త సాంకేతికతతో వచ్చింది.

ఈ ఫోన్ ధర విషయానికి వస్తే, బేస్ మోడల్ (4GB+64GB) కేవలం రూ. 12,999 కే లభిస్తోంది. అలాగే 4GB+128GB వేరియంట్ రూ. 14,499 కి, హై-ఎండ్ మోడల్ అయిన 6GB+128GB వేరియంట్ రూ. 16,499 కి అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన విధంగా ఏస్ బ్లాక్, ఆసమ్ బ్లూ  అమేజ్ పర్పుల్ వంటి ఆకర్షణీయమైన రంగులను ఎంచుకోవచ్చు. వచ్చే నెల ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్  షావోమీ అధికారిక స్టోర్లలో ఈ ఫోన్ అమ్మకాలు మొదలవుతాయి.

సాంకేతిక వివరాల్లోకి వెళితే, రెడ్‌మీ 15A లో 6.9 అంగుళాల పెద్ద హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడం వల్ల ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. గేమింగ్  యాప్స్ వేగంగా పనిచేయడానికి ఇందులో 'ఆక్టా-కోర్ T8300 5G' చిప్‌సెట్‌ను వాడారు. అంతేకాకుండా, ఇందులో ఉన్న వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ఫోన్ వేగాన్ని మరింత పెంచుకోవచ్చు. స్టోరేజీని పెంచుకోవాలనుకునే వారికి 2TB వరకు మెమరీ కార్డు వాడుకునే సదుపాయం కూడా ఉంది.

కెమెరాల విషయానికి వస్తే, ఫోన్ వెనుక భాగంలో 32 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. దీనివల్ల పగటి పూట మంచి క్వాలిటీ ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ (HyperOS 3) పై ఈ ఫోన్ పనిచేస్తుంది. గూగుల్ జెమిని వంటి ఏఐ (AI) ఫీచర్లు కూడా ఇందులో ఉండటం విశేషం. సాఫ్ట్‌వేర్ పరంగా కంపెనీ నాలుగేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లను అందిస్తామని హామీ ఇచ్చింది.

 ఈ ఫోన్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు రెండు రోజుల పాటు ఫోన్ వాడుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఇందులో 15W ఫాస్ట్ ఛార్జింగ్  రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. బరువు కూడా తక్కువగా ఉండటంతో చేత్తో పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. మొత్తం మీద చూస్తే, బడ్జెట్ ధరలో మంచి 5G ఫోన్ కోసం చూస్తున్న వారికి రెడ్‌మీ 15A ఒక చక్కని ఎంపిక అని చెప్పవచ్చు.

Be the first to react

More Coverage

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఆపిల్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ కొనుగోలు…

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: యాపిల్ మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్‌కు గట్టి పోటీ ఇస్తూ డెల్ సంస్థ తన ప్రీమియం ‘ఎక్స్‌ప…