నేటి యువత భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను విస్మరించి, పాశ్చాత్య పోకడలను గుడ్డిగా అనుసరిస్తోందని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. తన అర్ధాంగి లత నిర్వహించిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ విషయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. యువతతో పాటు కొందరు పెద్దలు కూడా మన దేశ గొప్పతనాన్ని, వారసత్వాన్ని తెలుసుకోవడంలో విఫలమవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో, మన సంస్కృతి గొప్పతనంపై అందరికీ అవగాహన కల్పించేందుకు తన భార్య లత మంచి ప్రయత్నం ప్రారంభించారని ప్రశంసించారు. లత చేపట్టిన ఈ కార్యక్రమం భగవంతుడి ఆశీస్సులతో విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు రజనీకాంత్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: 2 లక్షల ఉద్యోగాల సాధన లక్ష్యం.. రాష్ట్రంలో నేడు 11 MSME పార్కులకు శ్రీకారం!
ఈ మొబైల్ యుగంలో చాలా మంది యువతకు, చివరికి కొందరు పెద్దలకు కూడా మన దేశ గొప్ప సంప్రదాయాల గురించి తెలియడం లేదని ఆయన అన్నారు. భారతదేశపు ఘనమైన వారసత్వం, విలువలను తెలుసుకోకుండానే పాశ్చాత్య సంస్కృతి వైపు మొగ్గు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన మూలాలను మరిచిపోవడం సరికాదని హితవు పలికారు. విదేశీయులు సైతం వారి సంస్కృతుల్లో శాంతి, సంతోషాలను పొందలేక మన దేశం వైపు చూస్తున్నారని రజనీకాంత్ పేర్కొన్నారు. ఇక్కడి యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా వారు మానసిక ప్రశాంతతను పొందుతున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా, రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే, ఆయన ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చిత్రంలో నటిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!
మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..
అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ చిన్న పని తో..
కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!
6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: