BSNL దేశవ్యాప్తంగా 4జీ, బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉంటుంది. ఫోన్లు, ఇంటర్నెట్, వాట్సప్ గవర్నెన్స్ వంటి 730 ఆన్‌లైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు సులభంగా కాల్స్, డేటా, డిజిటల్ సేవలను పొందవచ్చు. విద్య, వ్యాపారం, ఆరోగ్య రంగాల్లో BSNL సేవలు కీలక పాత్ర పోషిస్తాయి.
బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను ఒడిశా రాష్ట్రంలోని జార్సుగుడా నుంచి వర్చువల్‌గా దేశవ్యాప్తంగా 97,500 టవర్లతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు.దేశాన్ని నడిపే సరైన నాయకుడు లేనప్పుడు అనేక సమస్యలు ఎదురయ్యాయి. గతంలో లైటింగ్ కాల్ బుక్ చేసుకోవడానికి వారం రోజులపాటు వేచి ఉండేవని గుర్తుచేశారు. సాంకేతిక పరిజ్ఞానంలో మోడీ నాయకత్వంలో గమనార్హమైన మార్పులు జరిగాయని, వాజపేయి గ్రేట్ స్టేట్స్ మెన్ ఆఫ్ కంట్రీ అని చెప్పుకొచ్చారు.
బీఎస్‌ఎన్‌ఎల్ దేశానికి శక్తివంతమైన సంస్థ అని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి దూరదర్శి విజన్ వల్ల దేశ అభివృద్ధి వేగంగా జరుగుతున్నది, ఇది ఎవరూ ఆపలేరు అని అన్నారు. ఫోన్లు కేవలం కాల్ కోసం కాకుండా, మల్టీపర్పస్ టూల్స్ అయ్యాయని, వాట్సప్ గవర్నెన్స్‌లో 730 సర్వీసులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్ల వల్ల జీవన ప్రమాణాలు ఎంతగా మెరుగుపడతాయో వివరించారు.
4జీ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏది అసాధ్యం కాదని, ప్రతి పది సంవత్సరాలకు సాంకేతికత మారుతూనే ఉంటుందని, భారత్ త్వరలో ప్రపంచానికి టెక్నాలజీ అందించగలదని ధీమా వ్యక్తం చేశారు.
బీఎస్‌ఎన్‌ఎల్ దేశానికి దిశా నిర్దేశకంగా మారింది. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ బీఎస్‌ఎన్‌ఎల్ విశేష గుర్తింపు పొందింది. స్పేస్ సిటీలో టెక్నాలజీని ప్రోత్సహిస్తామని, ప్రధానమంత్రి క్వాంటం మిషన్ వచ్చినప్పుడు క్వాంటం కంప్యూటర్లు మొదట అందుబాటులో ఉంటాయని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ కూడా ఏర్పడుతుందని తెలియజేశారు.
చంద్రబాబు నాయుడు భారతదేశం 2047 వరకు కార్పొరేట్ మరియు పబ్లిక్ సర్వీస్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉండేలా ఇన్నోవేషన్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. 4జీ టెక్నాలజీ, సాంకేతికత, ప్రభుత్వ విధానాలు కలసి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంలో కీలకంగా ఉంటాయని తెలిపారు.