చెప్పుడు మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను అని పోలీసుల ఎదుట పోసాని కృష్ణమురళి అంగీకరించారు. అప్పుడేదో అలా మాట్లాడేశానని పోలీసులతో అన్నట్లు సమాచారం. తొలుత విచారణకు సహకరించకుండా మొండితనం ప్రదర్శించిన పోసాని ఆ తర్వాత దారికొచ్చారు. సుమారు 9 గంటలపాటు పోలీసులు ఆయన్ని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో విభేదాలు సృష్టించేలా చేసిన వ్యాఖ్యల కేసులో అరెస్టయిన సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి విచారణలో తొలుత కొంత బెట్టు చేశారు. మొండితనం ప్రదర్శిస్తూ పోలీసులకు సహకరించలేదు. కానీ ఆ తర్వాత ఆయన మాట్లాడిన వీడియోలు చూపించి పోలీసులు ప్రశ్నించగా ఆ వీడియోలోని బూతుమాటలన్నీ తనవేని అంగీకరించారు. తాను తప్పు చేశానని, అలా మాట్లాడి ఉండకూడదన్నారు. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాన్న పోసాని ఇంతకన్నా తాను చేసేది, చెప్పేదీ ఏమీ లేదన్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనూ, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని చేసిన బూతు వ్యాఖ్యల వీడియోలన్నీ ఆయనకు చూపించిన పోలీసులు ఇవి చట్ట విరుద్ధం కాదా అంటూ ప్రశ్నించగా తొలుత ప్రతిదానికీ లవ్‌యూ రాజా అంటూ వింత జవాబులిచ్చారు. దర్యాప్తు అధికారులు లోతుగా ప్రశ్నించగా ఆ మాటలన్నీ తనవేనని, తాను నేరం చేశానని అంగీకరించారు. చంద్రబాబు, పవన్, నారా లోకేశ్‌ను ఎందుకు తిట్టాల్సి వచ్చింది ? వారి కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేయాలని ఎవరు ప్రోత్సాహించారని అని పోలీసులు అడగ్గా పోసాని మౌనం దాల్చారు. ఒక్కోసారి ' అవును రాజా చెప్పుడు మాటలు విన్నా' అని చెప్పారు. తన వ్యాఖ్యల వ్యవహారం ఇంతవరకు వస్తుందని తెలియక తప్పుచేశానని పోలీసులతో చెప్పారు. APFTVDC ఛైర్మన్ పోస్టు కోసమే అనుచిత వ్యాఖ్యలు చేశారా, అందుకే మీకు పదవి లభించిందా అని ప్రశ్నించగా ఆయన మౌనం వహించారు. పోలీసులు విచారణ మొత్తం వీడియా, ఆడియో రికార్డింగ్ చేశారు. అనంతరం దీన్ని కోర్టులో న్యాయమూర్తికి అందజేశారు. గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రాత్రి 9 గంటల వరకు అనంతపురం ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పోసానిని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌తోపాటు వారి కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేసి నేతల అభిమానులను రెచ్చగొట్టారంటూ పోసానిపై రైల్వేకోడూరు పోలీసుస్టేషన్‌లో మరో కేసు నమోదైంది. అలాగే విశాఖతోపాటు అనంతపురం, విజయవాడ, పాలకొండ, గుంటూరు, ఆదోని, నర్సీపట్నం, సూళ్లూరుపేట, పాడేరు, మంగళగిరిలోని సీఐడీ పోలీసుస్టేషన్లలో పోసానిపై కేసులున్నాయి. అల్లర్లు జరగాలనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగా పోసాని జుగుప్సాకర వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..
భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..
వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..
హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్ చెక్ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్ అయ్యాయో తెలుసా?
కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!
కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!
ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!
ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!
ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!
ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!
ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!
గుంటూరులో జగన్ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: