గుంటూరు మిర్చి యార్డ్తో రైతులకు చెందిన 14 మిర్చి టిక్కీలు మాయం అయ్యాయి. మిర్చి యార్డ్కు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చిన సమయంలో మిర్చి బస్తాలు మెట్టు కట్టిన చోట తోపులాట జరిగింది. భయంతో రైతులు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. కాసేపటికి తమ బస్తాల వద్దకు వచ్చి చూసుకున్న రైతులకు షాక్ తగిలింది. మిర్చి టిక్కీలు మాయమవడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. గుంటూరు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు సానుగంటి చైతన్య మిర్చి టిక్కీలు దొంగిలించినట్లు యార్డ్ అధికారులు గుర్తించారు. చైతన్య ఇసుజు ట్రక్కులో మిర్చి టిక్కీలు తీసుకెళ్తున్నట్లు యార్డ్ సీసీటీవీలలో కనబడింది. రెండు రోజుల క్రితం సరుకు అమ్ముకోవడానికి గుంటూరు మిర్చి యార్డ్కు పల్నాడు జిల్లా వెల్దుర్దికి చెందిన నారాయణ, వెంకట సుబ్బయ్య అనే రైతులు వచ్చారు. నారాయణ, వెంకట సుబ్బయ్యకు చెందిన 14 మిర్చి టిక్కీలను చైతన్య ఎత్తుకెళ్లాడు. యార్డ్ అధికారులు విషయాన్ని పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చైతన్య కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!
మిగిలింది మరో 8 రోజులే.. దేశవ్యాప్తంగా రోడ్లన్నీ ప్రయాగ్‌రాజ్ వైపే..
డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: