కెనడా తన ఇమిగ్రేషన్ నిబంధనల్లో చేసిన కీలక మార్పులు వేలాదిమంది భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనున్నాయి. కెనడా తాజా ‘ఇమిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్’ జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం సరిహద్దు అధికారులకు ఎలక్ట్రిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏఎస్), తాత్కాలిక రెసిడెంట్ వీసా (టీఆర్‌వీఎస్) వంటి తాత్కాలిక రెసిడెంట్ డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం వచ్చింది. ఈ కొత్త నిబంధనలతో భారత్ సహా విదేశీ విద్యార్థులు, ఉద్యోగులు, తాత్కాలిక రెసిడెంట్ విజిటర్లు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఎక్కువగా కెనడాను ఎంచుకుంటారు. భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం కెనడాలో 4.27 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..
సవరించిన నిబంధనలు కెనడా ఇమిగ్రేషన్ బోర్డర్ అధికారులకు మరిన్ని అధికారాలు కల్పించాయి. వీరు ఈటీఏఎస్, టీఆర్‌వీఎస్, వర్క్ పర్మిట్లు, స్టడీ పర్మిట్లను ప్రత్యేక పరిస్థితుల్లో రద్దు చేయవచ్చు. అంటే, తప్పుడు సమాచారం ఇచ్చారని, క్రిమినల్ రికార్డు ఉందని, లేదంటే గడువు ముగిసిన తర్వాత వారు కెనడా విడిచి వెళతాడన్న నమ్మకం లేనప్పుడు సరిహద్దు అధికారులు వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు. కెనడా తాజా నిర్ణయంతో దాదాపు 7 వేల అదనపు తాత్కాలిక రెసిడెంట్ వీసాలు వర్క్ పర్మిట్లు, స్టడీ పర్మిట్లు రద్దయ్యే అవకాశం ఉంది. విదేశీయులు, ముఖ్యంగా భారతీయుల పర్మిట్లు రద్దయితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే, కెనడా పోర్టుల నుంచి దేశంలోకి ప్రవేశించకుండా వారిపై నిషేధం విధించవచ్చు. లేదా వారు కెనడాను విడిచి వెళ్లాల్సి రావచ్చు.
ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్ చెక్ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్ అయ్యాయో తెలుసా?
కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!
కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!
ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!
ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!
ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!
ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!
ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!
గుంటూరులో జగన్ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: