మీరు ఉద్యోగం వదిలేసినా మీ పీఎఫ్ ఖాతా మీద వడ్డీ ఆగదు. మీరు 58 ఏళ్ల వరకు రిటైర్ కాకపోయినా ఆ వడ్డీ మీ ఖాతాలో కొనసాగుతూనే ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత కూడా 3 సంవత్సరాల వరకు వడ్డీ లభిస్తుంది. చాలా మంది వ్యక్తులు ఉద్యోగం మానేసిన వెంటనే పీఎఫ్ డబ్బు తీసేస్తారు కానీ ఇలా చేస్తే, వడ్డీ రూపంలో వచ్చే అదనపు మొత్తాన్ని కోల్పోతారు.
ప్రతి నెలా జీతంలో కొంత భాగం పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వం
సుమారు 8.25% వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా భద్రత కలిగిన పెట్టుబడి. రిటైర్మెంట్‌కి మంచి మొత్తాన్ని ఒకేసారి మీరు తీసుకునే విధంగా ఇది బాగా సహాయపడుతుంది.
చాలామందికి పీఎఫ్ ఏ విధంగా తీసుకోవాలి అనే సందేహాలు ఉంటాయి అయితే క్రింది విధంగా తెలుసుకోండి. మీరు 40–45 ఏళ్లకే ఉద్యోగం రిటైర్మెంట్ తీసుకున్న మీ ఖాతా అనేది కొనసాగుతూనే ఉంటుంది ప్రభుత్వం మీ పీఎఫ్ కి వడ్డీ ఇస్తూనే ఉంటుంది. అదే మీరు ఉద్యోగంలో 58 ఏళ్ల వరకు కొనసాగించిన మీ వడ్డీ అలానే పెరుగుతూనే ఉంటుంది. 58 ఏళ్లకు రిటైర్ అయ్యి డబ్బు వెంటనే తీసుకోకపోతే కూడా వడ్డీ ఇంకా 3 సంవత్సరాలు (61 ఏళ్ల వరకు) వచ్చే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు పీఎఫ్ డబ్బు ఎలా విత్‌డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇప్పటి సీనియర్ సిటిజన్స్ కు కొన్ని సాంకేతిక పద్ధతులు కాస్త అర్ధం కాకపోవచ్చు. కాబట్టి సులభంగా ఇలా చెయ్యవచ్చు.
ముందుగా మీ UAN నంబర్ తో EPFO వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.
మీ KYC వివరాలు (ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా) అప్డేట్ చేయండి.
వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ సర్వీసెస్ మెనూ లోకి వెళ్లండి.
అక్కడ Claim (ఫారమ్ 31, 19, 10C) ను ఎంచుకోండి.
మీ బ్యాంక్ ఖాతా ధృవీకరణ చేయండి.
డబ్బు విత్‌డ్రా చేసుకునే కారణాన్ని ఎంచుకోండి. ఉదాహరణకి రిటైర్మెంట్, మెడికల్, ఇల్లు కొనుగోలు, ఇతర కారణాలు.
చివరగా *OTP* తో కన్ఫర్మ్ చేసి, క్లెయిమ్ సబ్మిట్ చేయండి. 8. 7–8 రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.
పీఎఫ్ డబ్బు తీసుకోవడం చాలా సులభం, కానీ వడ్డీని కోల్పోకూడదు. జీతం నుండి నెలకు నెలకు రాబడిన ఈ ఫండ్స్ మీ రిటైర్మెంట్‌కి పెద్ద సొమ్ముగా మారతాయి. కాబట్టి పీఎఫ్ డబ్బును అవసరం తగినప్పుడు మాత్రమే తీసుకోవడం మంచిది అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి.