మన ఇంట్లో ప్రతి ఒక్కరూ వేర్వేరుగా జియో సిమ్ వాడుతూ, ప్రతి నెలా విడిగా రీఛార్జ్ చేస్తుంటే ఖర్చు ఎక్కువైపోతుంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని జియో ఒక కొత్త ఫ్యామిలీ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ కేవలం రూ.449తో లభిస్తుంది. ఒక్క రీఛార్జ్‌తో మూడు నంబర్లు యాక్టివ్‌గా ఉంచుకునే సౌకర్యం అందిస్తుంది. అంటే ఒక్కో నంబర్‌కి విడిగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఒకే రీఛార్జ్‌తో మొత్తం కుటుంబానికి ఉపయోగపడుతుంది.
రూ.449 ఫ్యామిలీ ప్లాన్ ప్రయోజనాలు ఈ ప్లాన్‌తో ఒక నెల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ సౌకర్యం లభిస్తుంది. అలాగే 75 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. డేటా అయిపోయిన తర్వాత ప్రతి జీబీకి రూ.10 చొప్పున ఛార్జ్ చేసుకోవచ్చు. అదనంగా ప్రతి ఫ్యామిలీ మెంబర్‌ను ఈ ప్లాన్‌లో జతచేస్తే వారికి 5 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. ప్రతిరోజూ 100 SMS కూడా ఉచితంగా పంపుకోవచ్చు.
ఈ ప్లాన్ తీసుకున్న వారికి జియో తన 9వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తోంది. ఇందులో భాగంగా రెండు నెలల జియోహామ్ సబ్‌స్క్రిప్షన్, మూడు నెలల జియోమార్ట్ గోల్డ్ సబ్‌స్క్రిప్షన్, మూడు నెలల జియోసినిమా ఉచిత సబ్‌స్క్రిప్షన్, అలాగే ఒక నెల జియోసావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది.
ఈ ప్యాకేజ్ ప్లాన్ తీసుకున్న వారికి AJIO ఆన్‌లైన్ షాపింగ్‌లో కూడా డిస్కౌంట్ లభిస్తుంది. రూ.1,000 షాపింగ్‌పై రూ.200 తగ్గింపు ఇస్తుంది. అలాగే జియో వెబ్ క్లౌడ్ ద్వారా 50 జీబీ ఉచిత స్టోరేజ్ కూడా ఇస్తున్నారు. దీనివల్ల ఫోటోలు, వీడియోలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు. ఇది కూడా కుటుంబానికి ఉపయోగపడే మంచి అవకాశమనే చెప్పుకోవచ్చు.
ఈ ప్లాన్ ఎంచుకున్న ఎలిజిబుల్ యూజర్లకు జియో నుంచి అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా లభిస్తుంది. అంటే వేగంగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. మొత్తం చూసుకుంటే రూ.449 ఫ్యామిలీ ప్లాన్ నిజంగా చాలా లాభదాయకం. ఒక్క రీఛార్జ్‌తో మూడు నంబర్లు యాక్టివ్‌గా ఉండటం, అదనపు డేటా, కాలింగ్, సబ్‌స్క్రిప్షన్లు, డిస్కౌంట్‌లు అన్నీ కలిపి కుటుంబానికి ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు.