ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా 216హెచ్ జాతీయ రహదారికి మోక్షం లభించింది. పెడన నుంచి లక్ష్మీపురం వరకు 120.85 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.4,245 కోట్లు కేటాయించగా, ఇప్పటికే డీపీఆర్ సిద్ధమైంది. ఈ రహదారి గుడివాడ, హనుమాన్‌జంక్షన్, నూజివీడు, విసన్నపేట మీదుగా లక్ష్మీపురం వరకు సాగనుంది. ఈ విస్తరణ వలన పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు కలిగించడమే కాకుండా, వాహనాల రద్దీ తగ్గిపోతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Tunnel works: సొరంగ మార్గానికి రూ.920 కోట్లు! ఇక దూసుకెళ్లిపోవచ్చు!
ఈ హైవే విస్తరణలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొమ్మిది చోట్ల బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. గుడివాడలో 15.3 కిమీ, హనుమాన్‌జంక్షన్‌లో 12.5 కిమీ, గుడ్లవల్లేరులో 6.7 కిమీ బైపాస్‌లు ఉండగా, అన్నవరంలో 2.9 కిమీ, పుట్టగుంటలో 2.4 కిమీ చిన్న బైపాస్‌లు రూపొందించనున్నారు. మొత్తం 54.6 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్లు ఉండేలా ప్రణాళిక వేసారు. హనుమాన్ జంక్షన్ రైల్వే లైన్ వద్ద ROB (రైల్వే ఓవర్ బ్రిడ్జ్), ఇతర బ్రిడ్జిలు, కల్వర్టులూ నిర్మించనున్నారు.
ఇది కూడా చదవండి: US Visa: అమెరికా వీసాకు కొత్త నిబంధన..! తక్షణమే అమల్లోకి..!
ఈ ప్రాజెక్టు కోసం సుమారు 700 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. దీనికి భూమి ధరల ఆధారంగా రూ.500 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. రెవెన్యూ అధికారులు భూముల విలువను అంచనా వేసి, భూస్వాములకు న్యాయమైన పరిహారం అందించనున్నారు. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Employement News: డిగ్రీ అర్హతతో నాబార్డులో స్పెషలిస్ట్ పోస్టులు! ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ మాత్రమే!
ఈ రహదారి విస్తరణతో మచిలీపట్నం పోర్టుకు తెలంగాణ నుంచి అనుసంధానం బలపడనుంది. ఖమ్మం నుండి గ్రానైట్, నూజివీడు మామిడిలు వంటి వస్తువుల రవాణా సులభతరం అవుతుంది. అంతేకాకుండా, అమరావతికి సమీపంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్‌కు ఈ హైవే కలవడంతో, రాజధానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోతుంది. అలాగే మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్, ఒంగోలు–కత్తిపూడి మధ్య ఉన్న ఆక్వా ఎగుమతుల అభివృద్ధికి ఇది దోహదపడనుంది.
ఇది కూడా చదవండి: Bullet Train Stuck China: ఆ రూట్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అడ్డుపడుతున్న చైనా.. కేంద్ర ప్రభుత్వం తీవ్ర కృషి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Airport Luggage Missing: ఎయిర్‌పోర్టులో లగేజీ పోయిందా? వెంటనే ఇలా చేయండి!
Clarity about Transfers: ఏపీ సచివాలయ ఉద్యోగులకు నో టెన్షన్! బదిలీల్లో అవి వర్తించవు!
Sarkar Decision: ఏపీ సర్కారు షాకింగ్ డెసిషన్! నేడు కీలక భేటీ!
South India Tour: ఒకే ట్రిప్‌లో "పద్మనాభ స్వామి టూ మదురై మీనాక్షి"! ప్యాకేజీలు ఇవే!
TTD Scan Process: టీటీడీ కీలక నిర్ణయం! జస్ట్ ఇలా స్కాన్ చేస్తే చాలు.. క్యూలైన్లో నిలబడక్కర్లేదు!
Ration Cutting: రేషన్‌కార్డు లబ్ధిదారులకు షాక్.. ఇకపై వారికి కట్! లిస్టులో మీరున్నారా?
Cancer Hospital: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన నందమూరి బాలకృష్ణ! హైదరాబాద్ వెళ్లే పని లేకుండా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: