భారతదేశపు మొట్టమొదటి హై స్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ భూగర్భ విభాగాన్ని నిర్మించడానికి అవసరమైన మూడు భారీ టన్నెల్ బోరింగ్ యంత్రాలు (TBMలు) చైనా ఓడరేవులో నిలిచిపోయాయి. ఈ యంత్రాలను జర్మన్ కంపెనీ హెరెన్‌క్నెక్ట్ నుండి ఆర్డర్ చేశారు. కానీ అవి చైనాలోని గ్వాంగ్‌జౌ నగరంలో తయారయ్యాయి. రెండు యంత్రాలు 2024 అక్టోబర్ నాటికి.. ఒక యంత్రం ఈ ఏడాది ప్రారంభంలోనే ఇండియాకు రావాల్సి ఉంది. కానీ, చైనా అధికారులు ఈ యంత్రాలు ఇండియాకు రానీయకుండా అడ్డుకుంటున్నారు. వీటిని రప్పించేందుకు భారత అధికారులు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ..
ఇది కూడా చదవండి: AP students: ఊపిరిపీల్చుకున్న ఏపి విద్యార్థులు.. ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న 10 మంది విద్యార్థులు!
నిలిపివేతకు గల కారణాలను డ్రాగన్ చెప్పడం లేదు. దీంతో ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) చేపట్టింది. ఈ ప్రాజెక్టు విలువ రూ. 1.08 లక్షల కోట్లు. సొరంగ పనుల కోసం NHSRCL జర్మన్ కంపెనీకి మూడు TBM యంత్రాలను ఆర్డర్ ఇచ్చింది. కానీ, అవి చైనాలోని గ్వాంగ్‌జౌ నగరంలో తయారయ్యాయి. TBM-1, TBM-2 సన్వాలి (ఘన్సోలి) నుంచి విఖ్రోలి, విఖ్రోలి నుండి BKC మధ్య సొరంగాలను నిర్మిస్తాయి. TBM-3 విఖ్రోలి నుంచి సన్వాలి మధ్య సొరంగాలను నిర్మిస్తుంది. మొదటి రెండు యంత్రాలు 2024 అక్టోబర్ నాటికే రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Gold Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒక్క రోజులోనే ఎంత తగ్గిందో తెలుసా?
TBM-3 ఈ సంవత్సరం ప్రారంభంలో రావాల్సి ఉంది. చైనా అడ్డుపడటం వల్ల ఇప్పటికీ ఈ మూడింటిలో ఒక్క యంత్రమూ భారత్ చేరుకోలేదు. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) TBM యంత్రాలను ఉపయోగించి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC), సావ్లి (ఘన్సోలి) మధ్య సొరంగం నిర్మించబోతోంది. యంత్రాలు రావడం ఆలస్యం అయితే బుల్లెట్ రైలు ప్రాజెక్టు సొరంగం పనులు ఆలస్యం కావచ్చు. ముఖ్యంగా BKC నుండి షిల్ఫాటా వరకు 21 కి.మీ.. థానే క్రీక్ కింద 7 కి.మీ. సొరంగం పనులు పూర్తి కావాల్సి ఉంది. అయితే, NHSRCL అధికారులు దీని గురించి ఏమీ చెప్పడం లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యం ఇప్పటికీ అలాగే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!
SIT notices: జగన్ కి షాక్.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు! విజయవాడ జైలులో..
Niharika Marriage: నిహారిక రెండో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. వాళ్లిద్దరి మధ్య!
Pulivendula Police: జగన్ కి దిమ్మతిరిగే షాక్.. వైకాపా ఎంపీ అనుచరులపై కేసు! మధ్యాహ్నం లోపు..!
Journalist Case: మురికి వ్యాఖ్యల కేసు.. 'నేను చేసింది తప్పే'.. పోలీసుల విచారణలో కృష్ణంరాజు వెల్లడి!
Singayya Case: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్! ఆ కేసులో ఏ2గా - డ్రైవర్ అరెస్ట్.?
security Lapses: నలుపురంగు కారులో వచ్చి.. జగన్ ఇంటిపై విసిరేసి వెళ్లాడు! సీసీటీవీ ఫుటేజీలో.!
Sajjala Criminal Case: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు.. వివరాలు ఇవే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: