దసరా లేదా విజయదశమి పండుగ తెలుగు ప్రజల జీవితంలో ఆధ్యాత్మికత సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగ సమయంలో తెలంగాణలో బతుకమ్మగా, ఆంధ్రప్రదేశ్‌లో దేవీ నవరాత్రులుగా వేడుకలు జరుగుతాయి. దసరా రోజున చేసే ప్రధాన ఆచారాల్లో పాలపిట్ట దర్శనం మరియు జమ్మి చెట్టు దర్శనం ముఖ్యమైనవి. పాలపిట్ట దర్శనాన్ని ప్రజలు అదృష్టానికి సంకేతంగా, శుభప్రదంగా భావిస్తారు.
ప్రజల విశ్వాసం ప్రకారం విజయదశమి రోజున పాలపిట్ట కనిపిస్తే ఆ ఏడాది అంతా శుభం జరుగుతుందని నమ్మకం ఉంది. ఈ ఆచారం వెనుక కొన్ని ఆసక్తికరమైన పురాణ కథలు ఉన్నాయి. ఒక కథలో మహాభారతంలో పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా దారిలో పాలపిట్టను చూసి అది విజయానికి సంకేతమని నమ్మారు. ఆ నమ్మకంతోనే వారు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించగలిగారు అనే నానుడి వినిపిస్తూ ఉంటుంది.
అప్పటినుంచి విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే మీ జీవితంలో కూడా అనేక శుభప్రదమైన కార్యాలు జరుగుతాయని ఇది ఒక ఆత్మీయత భావన.
మరో పురాణ కథ ప్రకారం శ్రీరాముడు వనవాసం పూర్తిచేసి అయోధ్యకు తిరిగి రావడానికి ముందే పాలపిట్ట దర్శనాన్ని శుభకరంగా భావించాడు. ఈ దర్శనం భాగంగానే రాముడు విజయాన్ని పొందాడని నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు దసరా రోజున పాలపిట్టను చూసి, తమ జీవితంలో శుభం, సౌభాగ్యం కలగాలని ప్రార్థిస్తారు.
ప్రాంతీయ సాంప్రదాయాల ప్రకారం, దసరా రోజున పాలపిట్ట కనిపిస్తే అది అదృష్టానికి సంకేతం అని అందుకే ఈ పక్షి కనిపిస్తే సాక్షాత్తు దైవాన్ని దర్శించిన అంత భాగ్యాన్ని కలుగుతుందని భక్తులు యొక్క భావన.
పాలపిట్ట దర్శనం దసరా పండుగలో ప్రత్యేక ప్రాధాన్యతను సంపాదించింది. ప్రజల విశ్వాసం, ఆధ్యాత్మికత, సంప్రదాయం లకు చిహ్నంగా మారింది. ప్రతి దసరా, పాలపిట్ట దర్శనాన్ని చూసి ప్రజలు ఆగమనం సంతోషం తో అమ్మవారి దీవెనలతో ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుందాం.