చంద్రబాబు బంపర్ గిఫ్ట్ ఈ దీపావళికే మూడు లక్షల ఇళ్లు సిద్ధం! కానీ అవి తప్పనిసరి!!.

అమెరికాలో రాజకీయ సంక్షోభం ముదిరిపోవడంతో అక్కడి ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్ మధ్య ప్రభుత్వ ఖర్చుల కేటాయింపుపై ఒప్పందం కుదరకపోవడమే దీనికి కారణమైంది. దీని ప్రభావం అమెరికా అంతర్గత పరిపాలనపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారులపై కూడా పడింది. ముఖ్యంగా, భారతీయ టెక్ నిపుణులు ఆధారపడే హెచ్-1బీ వీసా జారీ ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది. అత్యవసరంకాని అనేక ప్రభుత్వ కార్యాలయాలు తాత్కాలికంగా మూతపడగా, వీసా సంబంధిత దరఖాస్తులపై అనిశ్చితి నెలకొంది.

Railway Update: ప్రయాణికులకు అలెర్ట్! తిరుపతి వెళ్లే ఆ రైలు ఇప్పుడు అక్కడికి కూడా...

ఇమ్మిగ్రేషన్ న్యాయవాది నికోల్ గునారా ప్రకారం, హెచ్-1బీ వీసా ప్రక్రియలో కీలకమైన మొదటి దశ లేబర్ కండిషన్ అప్లికేషన్ (ఎల్‌సీఏ)ను అమెరికా కార్మిక శాఖ ఆమోదించాలి. కానీ కార్మిక శాఖ నిధులు కాంగ్రెస్ నుంచి వస్తాయి. ఇప్పుడు షట్‌డౌన్ కారణంగా ఆ నిధులు నిలిచిపోవడంతో ఎల్‌సీఏ దరఖాస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని ఆమె తెలిపారు. అంటే, ఇప్పటికే ఎల్‌సీఏ ఆమోదం పొందిన వారు తప్ప, కొత్తగా వీసా దరఖాస్తులు చేసుకున్నవారు లేదా ఉద్యోగం మారాలని భావిస్తున్నవారు షట్‌డౌన్ ముగిసే వరకు వేచి చూడాల్సిందే. ఇది అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల భవిష్యత్తును తాత్కాలికంగా సందిగ్ధంలోకి నెట్టింది.

New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్! తొలిసారి ఎగిరిన విమానం! ఎన్నో ఏళ్ల కల...

అయితే, యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) మాత్రం ఫీజుల ద్వారా నడుస్తుంది కాబట్టి దాని సేవలు కొనసాగుతాయి. అంటే, పిటిషన్ దాఖలు చేయడంలో ఇబ్బంది ఉండదు. కానీ ఎల్‌సీఏ ఆమోదం లేకుండా పిటిషన్ ముందుకు సాగదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, ట్రంప్ ప్రభుత్వం ఇటీవలే హెచ్-1బీ వీసాల వార్షిక ఫీజులను పెంచి, లాటరీ విధానాన్ని రద్దు చేస్తూ వేతనాల ఆధారంగా ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది. ఈ మార్పులు ఇంకా పూర్తిగా అమల్లోకి రాకముందే షట్‌డౌన్ రావడం వల్ల టెక్కీలలో అనిశ్చితి మరింత పెరిగింది.

కాంతార 1 రివ్యూ హీరోగా దర్శకుడిగా రిషబ్ శెట్టి మరోసారి ఇరగదీశాడు... సెకండాఫ్‌తో గూస్‌బంప్స్!!

ఇక, భారత్‌తో పాటు చైనా వంటి దేశాల నుంచి టెక్ కంపెనీలు నిపుణులను నియమించుకోవడానికి పూర్తిగా హెచ్-1బీ వీసాలపై ఆధారపడుతున్నాయి. వీసా ప్రక్రియ నిలిచిపోవడం వలన అమెరికాలో ఉన్న పెద్ద టెక్ కంపెనీలకూ అంతర్జాతీయ నియామకాలకూ అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇదే సమయంలో, భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. "నిధుల కొరత ఉన్నప్పటికీ, అమెరికాలోనూ విదేశాల్లోనూ రాయబార కార్యాలయాల ద్వారా పాస్‌పోర్ట్, వీసా సేవలు కొనసాగుతాయి" అని స్పష్టతనిచ్చింది. అయినా, కొత్త హెచ్-1బీ వీసా పొందదలచిన వారికి ఈ షట్‌డౌన్ ఒక పెద్ద అడ్డుగోడగా మారింది.

Health ATM: క్షణాల్లో బ్లడ్‌ రిపోర్ట్స్‌! అందుబాటులోకి హెల్త్‌ ఏటీఎంలు!
Chandrababu Foreign tour: చంద్రబాబు విదేశీ పర్యటనకు ముహూర్తం ఫిక్స్! గ్లోబల్ ఇన్వెస్టర్లతో కీలక భేటీలు!
దసరా.. సంస్కృతి, సంప్రదాయం, శాంతి, శ్రేయస్సు ప్రతీక!
మీ ఇంటికి తాబేలు రక్షణ కవచం.. అదృష్టం, సంపద రావాలంటే.! ఏ దిశలో పెట్టాలో తెలుసా?
Bhagavad Gita: దుష్టులను సత్పురుషులుగా మార్చగల మహాశక్తి గీతాజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 20!
ASEAN Summit: మోదీ ట్రంప్ పుతిన్ భేటీకి డేట్స్ ఫిక్స్.. ASEAN సమ్మిట్ వేదికగా చర్చలు!