Chandrababu Warning: ఏపీలో వాటికి ప్రోత్సహిస్తే కఠిన చర్యలు! అధికారులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మచిలీపట్నం-నరసాపురం, ఒంగోలు-దొనకొండ సహా 11 కొత్త రైల్వే మార్గాలపై ఇప్పటికే రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త లైన్లతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రైళ్ల రద్దీ తగ్గించేందుకు మూడు, నాలుగు, ఐదు, ఆరో లైన్లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద 1,960 కిలోమీటర్ల మేర 26 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు (సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు) సిద్ధం చేస్తున్నారు.

New Bridge: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! కొత్తగా మరో వంతెన.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! ఆ సమస్యలకు చెక్!

రైల్వే మార్గాలు లేని పలు ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరగనుంది. గతంలో సర్వే చేసిన 11 మార్గాలకు ఇప్పుడు రైల్వే బోర్డు అనుమతిచ్చింది. వీటికి డీపీఆర్‌లు సిద్ధం చేసి, అవసరమైన చోట బైపాస్ లైన్లు, రైల్ ఓవర్ రైల్ వంతెనల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ఇది స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలను మరింత సులభతరం చేస్తుంది.

Ap Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.! అక్టోబర్ 2 నుంచి గవర్నమెంట్ ఆఫీసుల్లో అవి బంద్.. !

అదేవిధంగా, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్లకు సంబంధించిన కసరత్తు కూడా ముమ్మరంగా సాగుతోంది. ఇందులో ఏపీ ప్రాంతం గుండా వందల కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైలు మార్గాలు ఉండనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్-బెంగళూరు రూట్‌లో 300 కి.మీ., హైదరాబాద్-చెన్నై రూట్‌లో 464 కి.మీ. వరకు ఏపీలో కొత్త మార్గాలు నిర్మించబడతాయి. దీని వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, రవాణా మరింత వేగవంతం అవుతుంది.

Tomorrow Holiday: దేశవ్యాప్తంగా రేపు స్కూళ్లకు సెలవు! ఎందుకో తెలుసా!

ఇక సరకు రవాణా విషయంలో కూడా రైల్వే శాఖ పెద్ద ఎత్తున మార్పులు చేయబోతోంది. విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, హైదరాబాద్ మార్గాల్లో సరుకు రైళ్ల రద్దీ అధికంగా ఉండటంతో కొత్త ట్రాక్‌లు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ సింహాచలం-కొత్తవలస మధ్య ఐదు, ఆరో లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. బొగ్గు, ఖనిజాలు రవాణా చేసే రైళ్ల కోసం ఈ మార్గం కీలకం అవుతుంది.

Bigg Boss-9: బిగ్‌బాస్ ఓటింగ్‌లో అనూహ్య మలుపు.. ఎవరు బయటకు వెళ్లబోతున్నారో తెలుసా?

మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రైల్వే లైన్ల కల ఇప్పుడు నెరవేరబోతోంది. పలు జిల్లాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతోపాటు, పరిశ్రమలు, వ్యాపారం, ఉద్యోగావకాశాలకు ఇది పెద్ద ఊతం ఇవ్వనుంది. రాబోయే సంవత్సరాల్లో ఏపీ రైల్వే మౌలిక సదుపాయాల్లో విశేషమైన అభివృద్ధి చోటుచేసుకోబోతోందని చెప్పవచ్చు.

బంగారు నిల్వలలో ఆ దేశం నెంబర్ వన్.. మరి మనం?
ఆ హీరో అప్ కమింగ్ చిత్రం రికార్డుల మోత తప్పదా? నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు!
Bhagavad Gita: ఇచ్ఛా, క్రియ, పరాశక్తి రూపంలో ప్రత్యక్షమయ్యే గీతా తత్త్వం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 6!
Paneer Tips: పనీర్ వండే ముందు ఈ చిట్కాలు పాటించండి.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం! 10 నిమిషాల్లో..
Stock Market: కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ జోరు... నేడు కూడా లాభాలే! బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లలో..