
ప్రపంచంలో బంగారాన్ని ఇష్టపడనివారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. ఈ లోహం సహజ ప్రక్రియ ద్వారా భూమిలో రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రక్రియ కొన్ని మిలియన్ల సంవత్సరాలు కూడా పట్టవచ్చు. భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ బంగారు గనులు చాలా ప్రసిద్ధి పొందాయి. ఈ గనుల చరిత్ర ఎంతో ఘనమైనది.
నేటి కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ, దానిపై ఉన్న మోజు మాత్రం తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ బంగారాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, రేపటి రోజున ధరలు మరింత పెరిగితే కొనే స్తోమత కోల్పోతామనే భయంతో, నేటి నుంచే బంగారాన్ని కొనుగోలు చేస్తూ, భవిష్యత్తు కోసం పొదుపు చేసుకుంటున్నారు.
బంగారం అత్యంత విలువైన లోహం ఏ దేశ ఆర్థిక స్థిరత్వానికైనా బంగారు నిల్వలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలోని అన్ని పెద్ద దేశాలు, ఆర్థిక సంక్షోభాలు తలెత్తినప్పుడు తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఈ బంగారు నిల్వలను వినియోగించుకుంటాయి. అందుకే వాటిని వ్యూహాత్మక ఆస్తులుగా పరిగణిస్తారు.
ప్రపంచంలోనే అత్యధిక బంగారు నిల్వలు అమెరికా వద్ద ఉన్నాయి సుమారు 8133.5 టన్నులు బంగారం ఉందని అంచనాలు ఉన్నాయి. రెండో స్థానంలో జర్మనీ కలదు ఈ దేశంలో దాదాపు 3351 టన్నులు బంగారం ఉందని అంచనా, ఇటలీ మూడో స్థానాన్ని కలిగి ఉంది 2425 బంగారు నిల్వ ఉంది. భారతదేశం బంగారం నిల్వలో ఎనిమిదో స్థానంలో దాాపు 876 టన్నుల బంగారం కలిగి ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారతదేశంలోనే దేవస్థానంలో అదేవిధంగా భారత దేశ ప్రజల దగ్గర అమెరికా ఖజానా కన్నా అధికంగా ఉందని చెప్పుకోవచ్చు.
పద్మనాభ స్వామి ఆలయంలో, తిరుపతి స్వామి దగ్గర జగన్నాథ ఆలయంలో, 40000 పైగా బంగారం నిల్వ ఉంది అంచనా భారతదేశం రోజు రోజు కీ బంగారాన్ని కొనుగోలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుత కాలంలో బంగారం కేవలం అప్పుడప్పుడు ధరించే ఆభరణం మాత్రమే కాదు. ఇది ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని, సామాజిక హోదాను ప్రతిబింబించే చిహ్నంగా మారింది.