పశ్చిమ ఐరోపాలోని చిన్న దేశం నెదర్లాండ్స్, తన ప్రత్యేకతతో ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. సముద్ర మట్టానికి దిగువన ఉన్న ఈ దేశం, ప్రకృతితో పోరాడుతూ సాధించిన విజయానికి చిహ్నంగా నిలుస్తుంది. ఆనకట్టలు, కాలువలు, విండ్‌మిల్లులు – ఇవన్నీ కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, మానవ తెలివితేటలకు నిదర్శనం.
నేటి ప్రపంచంలో నెదర్లాండ్స్‌ను ఆర్థిక శక్తిగా గుర్తిస్తారు. వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు, పువ్వుల వ్యాపారం నుంచి టెక్నాలజీ వరకు – అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంది. ట్యులిప్ పువ్వుల తోటలు కేవలం పర్యాటకులను ఆకర్షించడమే కాదు, దేశపు గర్వకారణం కూడా. “పువ్వుల దేశం” అనే బిరుదు యాదృచ్ఛికం కాదు, ఆ భూమి అందం చూసినవారికి ఆ పేరు అర్ధమవుతుంది.
ప్రజల జీవనశైలి కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. పట్టణాల్లో సైకిల్ మీదే ప్రయాణం చేసే సౌలభ్యం, ఆరోగ్యంపై చూపించే శ్రద్ధ, సాదాసీదా ఆహారపు అలవాట్లు అధిక ఎత్తులో ఉండే పురుషులు, సొగసైన స్త్రీలు, కళాత్మక ఇళ్ల నిర్మాణాలు ఇవన్నీ కలసి ఆ దేశానికి ప్రత్యేకమైన అందాన్ని తెచ్చిపెట్టాయి.
విద్యా రంగంలోనూ నెదర్లాండ్స్ ముందంజలో ఉంది. సాంకేతిక అభివృద్ధి, పరిశోధనలలో భాగస్వామ్యం, కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తి దేశాన్ని భవిష్యత్ దిశగా నడిపిస్తున్నాయి. విండ్‌మిల్లులు ఇంకా నీటిని తోడుతూ ఆ దేశ ఔన్నత్వాన్ని సాంప్రదాయ పాతదాన్ని కాపాడుకుంటూ, కొత్తదాన్ని ఆహ్వానించే దేశంగా కూడా చెప్పుకోవచ్చు.
పర్యాటకుల దృష్టిలో ఈ దేశం ఒక కలల ప్రదేశం. పడవల్లో కాలువల ప్రయాణం, క్యుకెన్‌హాఫ్ పూల తోటలో నడక, ఆమ్‌స్టర్‌డామ్ వీధుల్లో సైకిల్ రైడ్ ఇవి చూసినవారికి మరువలేని అనుభవాలు. ప్రపంచ సినిమాలు, టెలివిజన్ కూడా ఈ అందాలను వెండితెరపై నిలబెట్టాయి.
భారతీయులకు ఈ దేశం చేరాలంటే షెంజెన్ వీసా అవసరం. పాస్‌పోర్ట్ నుంచి బీమా వరకు పత్రాలు సమర్పించాలి. ఆమ్‌స్టర్‌డామ్‌లోని స్కీపోల్ విమానాశ్రయం ద్వారా ఈ దేశంలోకి ప్రవేశించవచ్చు. రైళ్లు, బస్సులు, ట్రామ్‌లు, మెట్రోలు – రవాణా సౌకర్యాలెన్నో ఉన్నాయి.
నెదర్లాండ్స్ కేవలం పర్యాటకుల గమ్యం మాత్రమే కాదు. ప్రకృతితో మనిషి చేసిన పోరాటానికి ప్రతీక, అభివృద్ధి మరియు సంప్రదాయం కలసిన జీవనశైలి.
Embassy of India, The Hague
Buitenrustweg 2
2517 KD The Hague
Netherlands
Contact Information
31-70-3469771, 0031 643743800 (after office hours)
--
hoc[dot]thehague[at]mea[dot]gov[dot]in, amb[dot]thehague[at]mea[dot]gov[dot]in, dcm[dot]thehague[at]mea[dot]gov[dot]in
Ambassador: Mr. Kumar Tuhin
Deputy Chief of Mission: Mr. Gince Kuruvilla Mattam.