ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (జేవర్ ఎయిర్‌పోర్ట్ అని కూడా అంటారు) అక్టోబర్ 30న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే.రాం మోహన్ నాయుడు ప్రకటించారు.
ప్రారంభం జరిగిన 45 రోజుల్లోపే, ఈ విమానాశ్రయం నుండి 10 ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు మొదలవుతాయి. ఈ నగరాల్లో బెంగళూరు, ముంబై, కోల్‌కతా వంటి పట్టణాలు ఉన్నాయి. ఇందుకోసం ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి విమానయాన సంస్థలతో చర్చలు పూర్తయ్యాయి.
ఈ విమానాశ్రయాన్ని ఆరు రహదారులు, రాపిడ్ రైలు-కమ్-మెట్రో లింక్ మరియు పొడ్ టాక్సీలు కలుపుతాయి. ప్రారంభమైన తర్వాత ఈ ఎయిర్‌పోర్ట్ DXN కోడ్‌తో పనిచేస్తుంది. గత సంవత్సరం డిసెంబర్ 9న రన్‌వే ట్రయల్స్ జరిగాయి. అప్పుడు ఒక వాణిజ్య విమానం విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. జూలైలో ఎయిర్‌పోర్ట్ అధికారులు చుట్టుపక్కల బిల్డర్లు, స్థానిక సంస్థలకు ఒక సూచన ఇచ్చారు. 20 కిలోమీటర్ల పరిధిలో ఎత్తైన భవనాలు కట్టకుండా జాగ్రత్త వహించాలని ఆ సూచనలో పేర్కొన్నారు.
అదే సమయంలో, ఘజియాబాద్‌లోని హిండన్ విమానాశ్రయాన్ని విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. దీని కోసం 9 ఎకరాల భూమి ఇవ్వమని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. విస్తరణ పూర్తయిన తర్వాత అక్కడ పార్కింగ్ సౌకర్యాలు మరింత పెరుగుతాయి అని తెలిపారు.
ప్రయాణికుల సౌకర్యం కోసం, దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ఉచిత వై-ఫై అందుబాటులోకి వస్తుంది అని ఈ సేవ వచ్చే రెండు నెలల్లో అందిస్తామని అలాగే, త్వరలో విమానాశ్రయాల్లో చిన్న లైబ్రరీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రయాణికులు తమ సమయాన్ని హుందాగా గడపవచ్చు అని చెప్పుకొచ్చారు.
నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైతే, ఉత్తర భారతదేశానికి అంతర్జాతీయ ప్రయాణాల్లో పెద్ద సౌకర్యం లభిస్తుంది. ఢిల్లీ విమానాశ్రయంపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇది వ్యాపారాలు, పర్యాటక రంగానికి కూడా చాలా మేలు చేస్తుందని అధికారులు రాజకీయ నిపుణులు చెబుతున్నారు.