ఇది కూడా చదవండి: Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!

రెడ్‌బుక్‌(Red Book) అనే పేరు చెబితే చాలు వైసీపీ నేత‌లకు గుండెల్లో దడ మొదలవుతోందని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల‌ మంత్రి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటనకు విచ్చేసిన ఆయనకు మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాశ్‌, పార్లమెంట్ సభ్యులు బాలశౌరి, శాసనసభ్యులు బోడె ప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్‌లతో పాటు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా తెలుగు మహిళలు మంత్రి లోకేశ్‌కు హారతి ఇచ్చి ఆశీర్వదించారు. పిల్లల చదువుల కోసం ఏ తల్లీ ఇబ్బంది పడకూడదన్న సదుద్దేశంతోనే "తల్లికి వందనం" పథకాన్ని అమలు చేస్తున్నామని లోకేశ్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: Employment News: ఏరోస్పేస్, డిఫెన్స్ పాలసీ 4.0తో ఉద్యోగాల సృష్టి! కొత్తగా సృష్టించన క్లస్టర్లలో..

ఈ పథకం అమలు చేయడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత వైసీపీ(YCP) ప్రభుత్వంలో మహిళలను కించపరిచే విధంగా నాయకులు ఎలా మాట్లాడారో ప్రజలందరూ గమనించారని ఆయన గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలకు త‌గిన గౌరవం లభిస్తుందని అన్నారు. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా మహిళలతో మాట్లాడే తీరులో మార్పు రావాలని లోకేశ్ తెలిపారు. ఈ మార్పు కేవలం చట్టాలు చేయడం ద్వారానో, డబ్బులు పంచడం ద్వారానో సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: AP New Ration Cards: కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడుఈ కీలక అప్‌డేట్ వెంటనే తెలుసుకోండి!

త్వరలోనే పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు (Parent-Teacher Meetings) నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. తన సతీమణి బ్రాహ్మణి సహకారం లేకపోతే తాను ఏ కార్యక్రమాన్నీ విజయవంతంగా నిర్వహించలేనని లోకేశ్‌ అన్నారు. అలాగే తన తల్లి భువనేశ్వరి ఎంతో త్యాగం చేయడం వల్లే, తండ్రి చంద్రబాబు రాష్ట్రానికి సేవ చేయగలుగుతున్నారని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని పెంచేలా తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!

Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!

Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!

Praja Vedika: నేడు (25/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..

Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!

Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!

Government Key Announcement: కరువు జిల్లాకు రూ.1,200 కోట్ల మరో ప్రాజెక్ట్.. 6,500 మందికి పైగా ఉద్యోగాలు!

Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!

AP New Ration Cards: కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడు? ఈ కీలక అప్‌డేట్ వెంటనే తెలుసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group