LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Telangana News Telugu: నా వయసు 73.. ఎవడైనా మునిగిపోయే పడవ ఎక్కుతాడా?' - మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు...!!

Telangana News Telugu: అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి చేశారు. తాను 'ట్రెండింగ్ స్టార్' అని, అవసరమైతే సొంతంగా సినిమా తీసి నటిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ.. కాంగ్రెస్ ఒక మునిగిపోయే నావ అంటూ…

AndhraPravasi News Desk 2 min read
Telangana News Telugu: నా వయసు 73.. ఎవడైనా మునిగిపోయే పడవ ఎక్కుతాడా?' - మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు...!!

Telangana News Telugu: తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లాబీల్లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన ఆయన, తనదైన శైలిలో పంచ్‌లు విసురుతూ అందరినీ నవ్వించారు. సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో తనకంటే పెద్ద "ట్రెండింగ్ స్టార్" ఎవరూ లేరని ధీమా వ్యక్తం చేశారు.

సాధారణంగా రాజకీయ నాయకులు సీరియస్ చర్చల్లో మునిగిపోతుంటారు. కానీ మల్లారెడ్డి రూటే వేరు. ఇటీవల తన 50వ పెళ్లి రోజు వేడుకల్లో ఆయన వేసిన స్టెప్పులు నెట్టింట ఎంతలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. దీనిపై స్పందిస్తూ, "ఇప్పుడు నేనే ట్రెండింగ్ స్టార్‌ను.. అసలు సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తోంది నేనే కదా! అంటూ చమత్కరించారు. తన వీడియోలు చూసి జనం ఎంజాయ్ చేస్తున్నారని, అది తనకు సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు.

ఇక సినిమాల్లో నటించే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు మల్లారెడ్డి మాస్ సమాధానం ఇచ్చారు... నాకు ఎవరో ఛాన్స్ ఇవ్వడం ఏంటి? నేనే ఒక స్టార్‌ను. నాకు సినిమా చేయాలనిపిస్తే.. ఎవరి కోసమో వెయిట్ చేయను. నేనే సొంతంగా సినిమా తీసి, అందులో హీరోగా నటిస్తా" అని ప్రకటించారు. మల్లారెడ్డి కాన్ఫిడెన్స్ చూసి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆయన ఎనర్జీ చూస్తుంటే త్వరలోనే వెండితెరపై మల్లారెడ్డి మార్క్ యాక్షన్ చూడవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

గత కొద్ది రోజులుగా మల్లారెడ్డి బీఆర్ఎస్ (BRS) వీడి కాంగ్రెస్‌లో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌తో ఆయన భేటీ కావడమే ఇందుకు కారణమని టాక్ నడిచింది. అయితే ఈ ప్రచారాన్ని మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు. "నాకు 73 ఏళ్లు.. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎవడైనా మునిగిపోయే పడవ ఎక్కుతాడా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అలాంటిదే. రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పినా, అది మునిగిపోయే నావ మాత్రమే" అని విమర్శించారు.

తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పిన ఆయన, క్షేత్రస్థాయిలో ఏ పార్టీ బలంగా ఉందో ప్రజలకు తెలుసని అన్నారు. ఇదే సమయంలో ఆయన కోడలు ప్రీతి రెడ్డి కూడా త్వరలోనే యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తారని వస్తున్న వార్తలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మొత్తానికి తన రాజకీయ వ్యూహాలతో పాటు, ఎంటర్టైన్మెంట్ విషయంలోనూ మల్లారెడ్డి మల్టీ టాలెంటెడ్ అని మరోసారి నిరూపించుకున్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…