LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Minister Narayana: వైసీపీ నేతలపై మండిపడ్డ మంత్రి నారాయణ! రివర్ బెడ్ కి, రివర్ బేసిన్ కి తేడా తెలియని నాయకులు...

Minister Narayana: రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు చేస్తున్న పరస్పర విరుద్ధ వ్యాఖ్యలను మంత్రి నారాయణ తప్పుబట్టారు. గతంలో రైతులను వేధించిన వైసీపీ, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక విషం కక్కుతోందని ఆయన విమర్శించారు.

AndhraPravasi News Desk 2 min read
Minister Narayana: వైసీపీ నేతలపై మండిపడ్డ మంత్రి నారాయణ! రివర్ బెడ్ కి, రివర్ బేసిన్ కి తేడా తెలియని నాయకులు...

Politics- రాజధానిపై వైసీపీకి క్లారిటీ లేదు.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు!

మాట తప్పడం, మడమ తిప్పడం వైసీపీ నైజం: మంత్రి ధ్వజం

రైతులను బూటు కాళ్లతో తన్నించిన చరిత్ర మీది.. ఇప్పటికైనా మారండి 

Minister Narayana: ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి రాజధాని విషయంలో వైసీపీ నేతలకు అసలు క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి అమరావతిపై విషం కక్కుతున్నారని, రివర్ బెడ్ కు, రివర్ బేసిన్ కు తేడా తెలియకుండా వారి నాయకుడు మాట్లాడుతుంటే, కింద ఉన్న నేతలు ఒక్కొక్కరు ఒకలా స్టేట్‌మెంట్లు ఇస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. రాజధానిపై వైసీపీ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికైనా బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రైతులు కోరుతున్నారని, అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో చర్చించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని మంత్రి గుర్తుచేశారు. గతంలో రాజధాని కోసం 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్, అధికారంలోకి రాగానే మాట మార్చి 'మూడు ముక్కలాట' ఆడారని ధ్వజమెత్తారు. రాజధాని కోసం 34,400 ఎకరాలు ఇచ్చిన రైతులను కంచెలు వేసి బంధించారని, ఆడవాళ్లని బూటు కాళ్లతో తొక్కించి అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ తీరు చూస్తుంటే వారి రాజకీయ ఉనికి త్వరలోనే ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారు.

వైసీపీ నేతలు మాట మీద నిలబడే తత్త్వం లేనివారని మరోసారి నిరూపించుకున్నారని నారాయణ విమర్శించారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుంటే ఓర్వలేక విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ అమరావతి అభివృద్ధిని కోరుకుంటున్నారని, కానీ వైసీపీ నేతలు మాత్రం ఇంకా పాత కక్షలతోనే రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు. అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కానీ తమ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా పనులను పూర్తి చేస్తుందని చెప్పారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకుని రాజధానిపై తమ నిర్ణయం ఏంటో సూటిగా చెప్పాలని, లేనిపక్షంలో గత ఎన్నికల్లో వచ్చిన 11 సీట్లు కాస్తా సున్నాకు పడిపోవడం ఖాయమని మంత్రి నారాయణ ఘాటుగా హెచ్చరించారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…