తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. మెగాస్టార్ గా ప్రతి ప్రేక్షకుడి హృదయంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన నటన, స్ఫూర్తి, వ్యక్తిత్వం తెలుగు సినీ ప్రపంచాన్ని అద్భుతంగా మార్చింది. కొడుకుగా, అన్నయ్యగా, కుటుంబ సభ్యుడిగా ఆయన ప్రతి పాత్రలో ప్రేక్షకుల మనసును గెలుచుకోవడం ఆయన ప్రత్యేకత. ఇప్పటి తరానికి ఏమోగానీ 80s, 90s యువతకు ఆయన ఒక ఆరాధ్య దైవంగా భావించేవారు. ఆయన సినిమా విడుదల అంటే థియేటర్స్ లో కనకపు వర్షాలు కురుసాయనే చెప్పుకోవచ్చు.
చిరంజీవి నటన, స్క్రీన్ ప్రెజెన్స్, కథలను జీవింపజేయగలిగే సామర్థ్యం, పాటల్లో, యాక్షన్ సీన్లలో చూపించే బలమూ, జోకులు, మానవీయతతో కూడిన నటన ప్రతి తెలుగు ప్రేక్షకుడి మనసును ఆకట్టుకుంటుంది. ఆయన ప్రతి చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచేలా ఉంటుందనే ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు.
మెగాస్టార్ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యి నేటికి 47 పూర్తికాడ విశేషంగానే చెప్పుకోవచ్చు అయితే అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికైనా ఎక్స్ లో తన అనుభవాన్ని ఈ క్రింది విధంగా రాయడం జరిగింది.
22 సెప్టెంబర్ 1978
'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.
నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే... అందుకు కారణం నిస్వార్ధమైన మీ "ప్రేమ".
ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ…
కృతజ్ఞతలతో
మీ
చిరంజీవి. అని ఆయన అనుభవాన్ని X ద్వారా తెలపడం జరిగినది.
ప్రస్తుతం మెగాస్టా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నయనతార నటిస్తున్న విషయం తెలిసినది ఈ చిత్రం, సంక్రాంతి 2026లో విడుదలకు సిద్ధమవుతుంది.విశ్వాంభర, వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఫాంటసీ చిత్రం, 2026 వేసవిలో ప్రేక్షకులను అలరించనుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి మాస్ ఇమేజ్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.