ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, ప్రొసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినెట్ వంటి తదితర ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1620 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మే 13వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంటర్, టెన్త్, 7వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2025 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 2, 2025. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చొప్పున చెల్లించవచ్చు. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి నెలకు స్టెనోగ్రాఫర్ పోస్టుకు రూ.34,580 నుంచి రూ.1,07,210 వరకు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.25,200 నుంచి రూ.80,910 వరకు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు రూ.20,000 నుంచి రూ.61,960 వరకు, మిగతా పోస్టులకు రూ.23,380 నుంచి రూ.76,730 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇది కూడా చదవండి: ఏపీలో ఆ ఉద్యోగులందరికి గుడ్‌న్యూస్..! జీతాలు డబుల్ పెరిగాయి, ఉత్తర్వులు జారీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!
గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!
ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!
ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!
ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!
అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!
ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!
'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: