ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్ని ప్రమాదం నుంచి కోలుకున్నా మార్క్ శంకర్ మానసిక స్థితి బాలేదని పవన్ తెలిపారు. అగ్ని ప్రమాదం తర్వాత మార్క్ శంకర్ కోలుకున్నప్పటికీ మానసికంగా ఇంకా ఇబ్బంది పోలేదన్నారు. ఇప్పటికీ భయడపడుతున్నాడని పవన్ వెల్లడించారు. మార్క్ శంకర్ ఇప్పటికీ రాత్రి సమయాల్లో నిద్రలో లేచి.. బిల్డింగ్ పైనుంచి పడిపోయినట్లు కలలు వస్తున్నాయని తెలిపారు. మార్క్ శంకర్ మానసిక స్థితిని నయం చేసేందుకు సైకియాట్రిస్ట్‌తో మెరుగైన చికిత్స చేయిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో అమరులైన వారికి జనసేన పార్టీ నివాళులర్పించింది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన తన కుమారుడు ఆరోగ్యాన్ని ప్రస్తావించారు.
మధుసూదన్ కుటుంబం కూడా తన కుమారుడి లాగే ప్రమాదాన్ని దగ్గర నుంచి చూసిందని.. ఆ బుల్లెట్ సౌండ్స్, భయానక వాతావరణం కారణంగా వాళ్లకు ఆ షాక్ నుంచి తేరుకోవడం కష్టం అని అన్నారు. ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు 8 ఏళ్ల మార్క్ శంకర్ సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇటీవల గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల బాలుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించారు. అనంతరం పవన్ కల్యాణ్ వెళ్లి ఆ కుటుంబాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే మార్క్ శంకర్ కు వైద్య చికిత్స అందిస్తున్నారు. శంకర్ సురక్షితంగా ఇంటికి చేరడంతో పవన్ భార్య అన్నా లెజినోవా తిరుపతికి వచ్చి తలనీలాలు సమర్పించారు. ఈమేరకు టీటీడీ అన్నప్రసాదానికి రూ. 17 లక్షలు విరాళం కూడా ఇచ్చి ముక్కులు చెల్లించుకున్నారు.
ఇది కూడా చదవండి: ముగిసిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం! రెండున్నర గంటల పాటు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..
మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!
రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!
రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!
వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: