LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Health

Health News: ప్రోటీన్ ఎక్కువగా తింటున్నారా? జాగ్రత్త.. ఆ వ్యర్థాలే క్యాన్సర్‌కు కారణం అంటున్న పరిశోధకులు..!!

Liver Health News: కాలేయం దెబ్బతిన్న వారిలో ప్రోటీన్ వల్ల విడుదలయ్యే అమ్మోనియా క్యాన్సర్ గడ్డలు పెరగడానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

AndhraPravasi News Desk 2 min read
Health News: ప్రోటీన్ ఎక్కువగా తింటున్నారా? జాగ్రత్త.. ఆ వ్యర్థాలే క్యాన్సర్‌కు కారణం అంటున్న పరిశోధకులు..!!

Liver Health News: సాధారణంగా మన ఆరోగ్యం మెరుగుపడాలంటే ప్రోటీన్  ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ, కాలేయం దెబ్బతిన్న వారి విషయంలో ఇది రివర్స్ అయ్యే అవకాశం ఉందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. దెబ్బతిన్న కాలేయం మనం తినే ఆహారంలోని వ్యర్థాలను సరిగ్గా శుభ్రం చేయలేకపోవడం వల్ల, ఆ వ్యర్థాలే క్యాన్సర్ గడ్డలు పెరగడానికి  కారణంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

సాధారణంగా మనం తీసుకునే ప్రోటీన్ జీర్ణమైనప్పుడు శరీరంలో అమ్మోనియా అనే వ్యర్థ పదార్థం విడుదలవుతుంది. ఆరోగ్యంగా ఉన్న కాలేయం ఈ అమ్మోనియాను 'యూరియా'గా మార్చి మూత్రం ద్వారా బయటకు పంపేస్తుంది. అయితే ఫ్యాటీ లివర్, హెపటైటిస్ లేదా మద్యం వల్ల కాలేయం దెబ్బతిన్నప్పుడు, ఈ శుభ్రపరిచే ప్రక్రియ  ఆగిపోతుంది. దీనివల్ల రక్తంలో అమ్మోనియా పేరుకుపోతుంది. ఈ పేరుకుపోయిన అమ్మోనియాను క్యాన్సర్ కణాలు తమ ఎదుగుదలకు అవసరమైన ఆహారంగా మార్చుకుంటున్నాయని రట్జర్స్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది.

పరిశోధకులు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాలేయ వ్యాధి ఉన్న ఎలుకలకు ప్రోటీన్ తక్కువగా ఉండే ఆహారం ఇచ్చినప్పుడు, వాటిలో క్యాన్సర్ గడ్డల పెరుగుదల నెమ్మదించింది. అంతేకాకుండా, ఆ ఎలుకలు ఎక్కువ కాలం జీవించగలిగాయి. తక్కువ ప్రోటీన్ వల్ల శరీరంలో తక్కువ అమ్మోనియా తయారవుతుందని, దీనివల్ల క్యాన్సర్ కణాలకు కావాల్సిన నైట్రోజన్ అందక అవి బలహీనపడతాయని శాస్త్రవేత్త వెయి-క్సింగ్ జోంగ్ వివరించారు.

అయితే ఇది అందరికీ వర్తించే సూత్రం కాదు క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగులకు సాధారణంగా నీరసం రాకుండా ఉండటానికి ప్రోటీన్ ఎక్కువగా తీసుకోమని చెబుతుంటారు. కానీ కాలేయ వ్యాధులు  ఉన్నవారు మాత్రం ప్రోటీన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రోటీన్ మరీ ఎక్కువగా తీసుకుంటే కాలేయంపై భారం పడి, క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. అదే సమయంలో మరీ తక్కువగా తీసుకుంటే శరీరం బలహీనపడే ప్రమాదం ఉంది. అందుకే ఎంత తీసుకోవాలనేది డాక్టర్ల సలహా మేరకే నిర్ణయించుకోవాలి.

 ఈ పరిశోధన కాలేయ క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ఆహార నియమాల ద్వారా లేదా అమ్మోనియాను తగ్గించే మందుల ద్వారా క్యాన్సర్‌ను అరికట్టవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న కోట్లాది మందికి ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక. 

Be the first to react

More Coverage