ఏపీ మంత్రివర్గ భేటీ ఈ రోజు జరగనుంది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వేళ ఈ సమావేశం కీలకంగా మారుతోంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకాల మార్గదర్శకాల పైన చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త పెట్టబడులు.. భూ కేటాయింపుల పైన చర్చించనున్నారు. రేషన్ వాహనాల రద్దు పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు.. ఉపాధ్యాయుల అంశాల పైన నేటి సమావేశంలో చర్చకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
మంత్రివర్గ భేటీలో
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్దమైంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం పైన కసరత్తు చేస్తోంది. బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చి విధంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ 15 వేలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్దిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. అదే విధంగా అన్నదాత సుఖీభవ పథకం అమలు మూడు విడతల్లో అమలు చేయనున్నారు. తల్లికి వందనం పథకం మాత్రం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఇస్తామని చెబుతున్నారు. జూన్ 12న వేసవి సెలవులు పూర్తయి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్..! కేవలం 9 గంటల్లో..!
తల్లికి వందనం
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసారు. బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చిన విధంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ 15 వేలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్దిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటి కే పలు మార్లు స్పష్టం చేసింది. అయితే, తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఈ పథకం అమలు విషయంలో కొత్త చర్చ మొదలైంది. చంద్రబాబు వ్యాఖ్యలతో శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల సమయంలో తల్లికి వందనం పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం అమలు చేస్తామని మరో సారి స్పష్టం చేసారు. విద్యా సంవత్సరం ప్రారంభం లోగా ఇస్తామని చెబుతూనే... ఒక ఇన్ స్టాల్ మెంటా లేక ఎలా ఇవ్వాలనేది ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.
ఒకే విడతలో ఇస్తారా
దీంతో, ఒకే విడతలో రూ 15 వేలు చెల్లిస్తారా.. రెండు విడతలుగా రూ 7500 చొప్పున చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్దిదారుల సంఖ్య... కావాల్సిన నిధుల పైన ఒక అంచనాకు వచ్చారు. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి ఉండటంతో ఇనిస్టాల్ మెంట్ అంశం తెర పైకి వచ్చినట్లు కనిపిస్తోంది. దీని పైన నేటి మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువు తున్నారు. అయితే ఇందులో ప్రాధమికం గా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యా శాఖ తేల్చిన్నట్లు సమాచారం. ఇదే సమ యం లో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. ఆదాయ పన్ను చెల్లింపు దారులు..తెల్లరేషన్ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చ! ఆ మూడు డిమాండ్లపై..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి!
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!
ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: