ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు ప్రధాన అంశాల పైన చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అమరావతి లో పనుల పైన సీఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అన్నదాత సుఖీభవ .. తల్లికి వందనం పథకాల అమలు పైన నిర్ణయం తీసుకోవటంతో.. మార్గదర్శకాల పైన మంత్రివర్గం చర్చించనుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులను మంత్రివర్గం అభినందించనుంది. అదే విధంగా మంత్రుల పనితీరు పైన సీఎం చంద్రబాబు మరోసారి దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.
కీలక నిర్ణయాలు
ఏపీ మంత్రివర్గం ఈ రోజు సచివాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపనున్నారు. 47 వ సీఆర్డీ ఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూకేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన అన్నదాత సుఖీభవ .. తల్లికి వందనం మార్గదర్శకాల పైన చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: జగన్ నీకు కూడా అదే గతి! మంత్రి సంచలన వ్యాఖ్యలు!
అన్నదాత సుఖీభవ అమలు
రైతులకు ప్రతీ ఏటా 20 వేల రూపాయలు ఆర్దిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని మూడు విడుతలుగా రైతులకు అందించనున్నారు. కౌలు రైతులకు వర్తించేలా నిర్ణయించారు. కేంద్రం పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఇచ్చే నిధులతో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనున్నారు. కాగా, ఈ పథకం అర్హతల పైన ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. వీటి పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అర్హులైన ప్రతీ రైతుకు అందించాలని నిర్ణయంచారు. ఉద్యానవనం, పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు సాగు చేసేవారు కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు.
మార్గదర్శకాలు
అన్నదాత సుఖీభవ పథకానికి పది వేలకు పైగా పెన్షన్ పొందేవారు.. ప్రభుత్వ ఉద్యోగాలు, పదవు ల్లో ఉన్న వారికి పథకం అమలు కాదు. ఆర్దికంగా రైతులకు మద్దతుగా నిలిచేందుకు అమలు చేస్తున్న ఈ పథకంలో ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు, ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అనర్హులు. గతేడాది పన్ను చెల్లించిన వారికి పథకం అమలు కాదు. ఇక, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చినా ఈ పథకానికి అనర్హులుగా అధికారులు ప్రతిపాదించారు. వీటి పైన నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక.. ఈ నెల 27,28,29 తేదీల్లో జరిగే మహానాడు పైనా అధికారిక అజెండా పూర్తయిన తరువాత చర్చించే ఛాన్స్ ఉంది. మంత్రుల పని తీరు పైనా చంద్రబాబు మరోసారి దిశా నిర్దేశం చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!
గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!
ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!
ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!
ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!
అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!
ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!
'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: