రాష్ట్రంలోని పలు ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా మరో కీలక ప్రకటనను విడుదల చేసింది. కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల రాతపరీక్ష నిర్వహించిన ఏపీపీఎస్సీ.. తాజాగా మెరిట్‌లిస్ట్‌ను విడుదల చేసింది.
ఈమెరిట్‌లో ఎంపికైన అభ్యర్థుల అర్హతల ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 19, 2025న జరగనుంది. ఇందుకోసం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని కార్యదర్శి వెల్లడించారు.